ఈ హీరోయిన్ ఆస్తులు తెలిస్తే గుండె ఆగిపోద్ది, స్టార్ హీరోలకు మొగుడు
సాధారణంగా ఇండియన్ సినిమాలో హీరోల డామినేషన్ ఎక్కువ కాబట్టి వాళ్ళ ఆస్తులే ఎక్కువగా ఉంటాయి అనే మాట వాస్తవం. అగ్ర హీరోలకు సినిమాలే కాకుండా ఇతర వ్యాపారాలు కూడా భారీగా ఉంటాయి కాబట్టి వేల కోట్లు ఆస్తులు సంపాదిస్తారు.
సాధారణంగా ఇండియన్ సినిమాలో హీరోల డామినేషన్ ఎక్కువ కాబట్టి వాళ్ళ ఆస్తులే ఎక్కువగా ఉంటాయి అనే మాట వాస్తవం. అగ్ర హీరోలకు సినిమాలే కాకుండా ఇతర వ్యాపారాలు కూడా భారీగా ఉంటాయి కాబట్టి వేల కోట్లు ఆస్తులు సంపాదిస్తారు. కానీ ఓ హీరోయిన్… ఇండియాలో స్టార్ హీరోలను మించి ఆస్తులు సంపాదించింది. అసలు ఎవరు ఆ హీరోయిన్ ఏంటి ఆ కథ చూద్దాం. 2024 హురున్ ఇండియా రిచ్ లిస్ట్ విడుదల చేసిన టాప్ 10 సెల్ఫ్ మేడ్ ఉమెన్ లిస్ట్‌లో జూహీ చావ్లా ఇండియాలోనే అత్యంత సంపన్న నటిగా గుర్తింపు పొందింది. ఈ లిస్టు లో ఆరో స్థానానికి చేరుకుంది.
4600 కోట్ల నికర ఆస్తులతో ఆమె ఇండియాలోని టాప్ 10 సెల్ఫ్ మేడ్ మహిళలలో ఆరో స్థానం సంపాదించారు. 7000 కోట్లకు పైగా నికర ఆస్తులు కలిగిన ఆమె వ్యాపార భాగస్వామి షారుఖ్ ఖాన్ తర్వాత ఆమె రెండవ సంపన్న నటిగా నిలిచారు. దీని వెనుక బలమైన కారణమే ఉంది. ఆమె భర్త, ప్రముఖ వ్యాపారవేత్త జే మెహతా 1995 నుండి ది మెహతా గ్రూప్ చైర్మన్ గా ఉన్నారు. అలాగే ఆమెకు షారూక్ ఖాన్ కు మధ్య మంచి స్నేహమే ఉంది. షారుఖ్ ఖాన్‌తో కలిసి ఐపిఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీం కోల్‌కతా నైట్ రైడర్స్ కు సహ యజమానిగా ఉన్నారు.
ఫోర్బ్స్ ప్రకారం, 2022 నాటికి కేకేఆర్ నికర విలువ దాదాపు 1.1 బిలియన్ డాలర్లు. అంటే సుమారు రూ. 9,139 కోట్లు. జూహీ చావ్లా, జే మెహతా దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు ముంబైలోని ఖరీదైన ప్రాంతంలో ఒకటైన మలబార్ హిల్స్ లో నివాసం ఉంటున్నారు. ఇక జూహీ చావ్లా దంపతులకు ఖరీదైన కార్లు ఉన్నాయి. బీఎండబ్ల్యూ 7 కారు వీరి సొంతం. దాని ధర రూ. 3.3 కోట్లు. దాదాపు అన్ని టాప్ బ్రాండ్ ల కార్లను ఈ దంపతులు కొనుగోలు చేసారు. బెంజ్ ఎస్ క్లాస్, జాగ్వార్ ఎక్స్ జే, పోర్షే కయెన్ వంటి బ్రాండ్ల కార్లు వీరి గ్యారేజ్ లో ఉన్నాయి.