జూనియర్ మహేష్ వచ్చేసాడు.. వైరల్ అవుతున్న గౌతమ్ ఘట్టమనేని వీడియో..!

తెలుగు ఇండస్ట్రీలో చాలాకాలం తర్వాత వారసుల గురించి మళ్ళీ చర్చ మొదలైంది. గత 10 సంవత్సరాలుగా కొత్తగా వారసులు ఎవరు పెద్దగా రాలేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 21, 2025 | 07:51 PMLast Updated on: Mar 21, 2025 | 7:51 PM

Junior Mahesh Has Arrived Gautham Ghattamanenis Video Is Going Viral

తెలుగు ఇండస్ట్రీలో చాలాకాలం తర్వాత వారసుల గురించి మళ్ళీ చర్చ మొదలైంది. గత 10 సంవత్సరాలుగా కొత్తగా వారసులు ఎవరు పెద్దగా రాలేదు. మిలీనియం మొదట్లో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్.. దానికి నాలుగేళ్ల ముందు పవన్ కళ్యాణ్.. 2002లో ప్రభాస్, 2003లో అల్లు అర్జున్, 2007లో రామ్ చరణ్, 2009లో నాగ చైతన్య ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇందులో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సూపర్ స్టార్స్ అయ్యారు. కెరీర్ మొత్తం మీ ఇద్దరి మధ్య ఆసక్తికరమైన పోరు నడుస్తూనే ఉంది. నువ్వా నేనా అన్నట్లు దూసుకుపోతున్నారు పవన్, మహేష్. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్ మధ్య కూడా అలాంటి పోటీయే ఇప్పటికీ నడుస్తుంది. వీళ్ళ తర్వాత 2010లో రానా.. 2013లో సాయి ధరమ్ తేజ్.. 2014లో వరుణ్ తేజ్.. 2015లో అఖిల్ వచ్చాడు. అయితే అక్కినేని వారసుడు ఇప్పటి వరకు బ్లాక్ బస్టర్ కొట్టలేదు. అఖిల్ తర్వాత చెప్పుకోదగ్గ వారసుడు ఇండస్ట్రీ ఇప్పటి వరకు పరిచయం కాలేదు.

తాజాగా మెగా, నందమూరి, ఘట్టమనేని కుటుంబాల నుంచి వారసులు ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉండడంతో సోషల్ మీడియాలో చర్చ బాగా జరుగుతుంది. తాజాగా మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేని యాక్టింగ్ వీడియో ఒకటి బాగా వైరల్ అవుతుంది. ప్రస్తుతం విదేశాల్లో చదువుకుంటున్నాడు గౌతమ్. చదువుతో పాటు యాక్టింగ్ పై కూడా ఫోకస్ చేశాడు ఈయన. అక్కడి యాక్టింగ్ స్కూల్లో భాగంగా ఒక షార్ట్ ఫిలింలో నటించాడు గౌతం. బ్రెయిన్ వాష్డ్ పేరుతో వచ్చిన ఈ షార్ట్ ఫిలిం విడుదలైంది. ఈ రెండు నిమిషాల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అందులో గౌతమ్ ను చూస్తుంటే అచ్చం మహేష్ బాబును చూస్తున్నట్టే ఉంది అని సంబరపడిపోతున్నారు ఘట్టమనేని అభిమానులు.

మరోవైపు మెగా కుటుంబం నుంచి అకీరా నందన్ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. పైగా గత కొన్ని రోజులుగా పబ్లిక్ లో ఎక్కువగా కనిపిస్తున్నాడు అకిరా. పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడికి వెళ్ళినా కొడుకును వెంట పెట్టుకొని వెళ్తున్నాడు. దీన్ని బట్టి త్వరలోనే జూనియర్ పవర్ స్టార్ అరంగేట్రం ఉండబోతుందని అర్థమవుతుంది. ఇక లాస్ట్ బట్ నాట్ ది లిస్ట్ నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ. బాలయ్య తనయుడు ఎంట్రీ కోసం ఇప్పటికే డైరెక్టర్ కూడా లాక్ అయిపోయాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అదిరిపోయే సోషియో ఫాంటసీ సినిమాతో కొడుకును లాంచ్ చేయాలని చూస్తున్నాడు బాలయ్య. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు రానుంది. ఎలా చూసుకున్నా కూడా చాలా తక్కువ గ్యాప్ లోనే ఈ ముగ్గురు వారసులు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అదే జరిగితే అభిమానులకు అంతకంటే కిక్ ఇచ్చే న్యూస్ మరొకటి ఉండదు.
https://www.instagram.com/reel/DHcYnmnpCFb/?utm_source=ig_embed&ig_rid=8259b265-aa88-4698-883c-017ef8c9656d