Jr. NTR And Ram Charan: ఇదేం ట్విస్టు.. ఫ్లాష్ బ్యాక్ సేమ్..?
భారీ ప్రాజెక్టులను తెరకెక్కించే దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్ గురించి తాజా అప్డేట్స్ మీకోసం.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో శంకర్ తీస్తున్న సినిమా గేమ్ ఛేంజర్.. ఇందులో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో చరణ్ 50 ఏళ్ల పాత్రలో రైతు నాయకుడిగా కనిపిస్తాడట. ఇక ప్రజెంట్ టైం పీరియడ్ లో మాత్రం ఐఏఎస్ పాత్రలో కనిపిస్తాడన్న వార్త చక్కర్లు కొడుతోంది. దీంతో ఇది తండ్రి కొడుకుల కథా? లేదంటే ఏజ్ గ్యాప్ ఉన్న అన్నదమ్ముల కథా అన్న చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది.
అయితే ఇలాంటి ఫ్లాష్ బ్యాకే ఎన్టీఆర్ దేవరలో కూడా ఉందనే అనుమానాలు పెరిగాయి. కొత్తగా అందుతున్న సమాచారం ప్రకారం కొరటాల శివ తీస్తున్న దేవరలో 60 ఏళ్ల పెద్దాయన పాత్రలో తారక్ కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో ఎన్టీఆర్ 60 ఏళ్ల పాత్ర ఉంటుందట. అంటే దేవరలో కూడా తారక్ వేసేది డబుల్ రోల్స్ అని తేలిపోయింది.
ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే గేమ్ ఛేంజర్ లో, అలానే దేవరలో ఫ్యాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉండటం. అందులో ఇద్దరు హీరోలు 50ఏళ్లకు మించిన లుక్ తో పాత్రలు వేయటం.. ఇక్కడే ఒకప్పటి ఊసరవెళ్లి, రచ్చ మూవీల కథలు రివైండ్ అవుతన్నాయి. ఈ రెండు సినమాలు దగ్గర దగ్గర ఒకే టైంలో రిలీజ్ అయ్యాయి. రెండిట్లో కూడా తమన్నానే హీరోయిన్. అలానే విలన్ ఆటకట్టేలా హీరోకి ఓ టాస్క్ ఇచ్చేది కూడా హీరోయినే. ఇదంతా అప్పట్లో రెండు సినిమాలకు కామన్ గా పనిచేసిన ఘోస్ట్ రైటర్ల నిర్వాకమే అని ప్రచారం జరిగింది. సో శంకర్, కొరటాల శివ ఈ ఇద్దరు దర్శకుల అసిస్టెంట్ రైటర్ల నిర్వాకంతో ఇప్పడు గేమ్ ఛేంజర్, దేవరలో కూడా ఫ్లాష్ బ్యాక్ రిపీట్ కాబోతోందట. ఎందుకంటే ఈ రెండీంటికి ముగ్గురు ఘోస్ట్ రైటర్లు పనిచేశారని తెలుస్తోంది. కొన్ని సార్లు కథలు సిమిలర్ అనిపించటానికి ఘోస్ట్ రైటర్లే కారణమవటం వెరీ వెరీ కామన్.