Jr NTR: రాంచరణ్ కూతురికి ఎన్టీఆర్ అద్భుతమైన గిఫ్ట్..
క్లీన్‌కారా రాకతో.. మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్నంటాయ్. తమ సంతోషాన్ని తెలిపేలా.. బారసాల ఫంక్షన్ కూడా గ్రాండ్‌గా నిర్వహించారు చిరు. ఇప్పటి వరకు తమ చిన్నారిని రాంచరణ్ దంపతులు.. అభిమానులకు చూపించలేదు ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ఈ మెగా ప్రిన్సెస్ ఎలా ఉందని చూసేందుకు సెలబ్రిటీలు కూడా చిరంజీవి ఇంటికి వెళ్తున్నారని తెలుస్తోంది.

Junior NTR sent special gifts to Ramcharan's daughter Klinkara
రాంచరణ్ ఫ్రెండ్స్, చిరు ఫ్యామిలీ ఫ్రెండ్స్.. క్లీన్‌కారా కోసం ప్రత్యేకమైన బహుమతులు పంపిస్తున్నారు. ట్రిపుల్ ఆర్‌తో చెర్రీ, ఎన్టీఆర్ క్లోజ్ ఫ్రెండ్స్‌గా మారిపోయారు. దీంతో చెర్రీ కూతురి కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా గిఫ్ట్స్ పంపించారని తెలుస్తోంది. ప్రత్యేకంగా తయారుచేయించిన ఓ లాకెట్‌ను క్లీన్‌కారాకు ప్రజెంట్ చేశారట రామ్‌చరణ్. రాంచరణ్, ఉపాసన పేర్లతో పాటు క్లీన్‌కారా పేరు ఉన్న ఒక గోల్డ్ లాకెట్ డిజైన్ చేయించారని తెలుస్తోంది. లాకెట్‌తో పాటు మరికొన్ని బొమ్మలను కూడా కానుకగా పంపించారని తెలుస్తోంది. ఎన్టీఆర్ మాత్రమే కాకుండా.. ఆయన కొడుకులు కూడా క్లీన్‌కారా కోసం కొన్ని స్పెషల్ గిఫ్ట్ పంపించారట.
ఎన్టీఆర్ పెద్ద కొడుకు వేసిన కొన్ని డ్రాయింగ్స్‌ను ప్రత్యేకంగా ప్యాక్ చేయించి.. రాంచరణ్‌కు పంపించాడట ఎన్టీఆర్. ఈ గిఫ్ట్ చూసి రాంచరణ్, ఉపాసన.. ఫుల్ ఖుష్ అయ్యారని తెలుస్తోంది. ఆ గిఫ్ట్స్.. డ్రాయింగ్స్ చూసి.. ఎన్టీఆర్, ప్రణతికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారని తెలుస్తోంది. ట్రిపుల్ ఆర్ మూవీ తర్వాత.. చెర్రీ, ఎన్టీఆర్ అన్నాదమ్ముల్లా మారిపోయారు. ఇద్దరి ఇళ్లలో ఏ ఈవెంట్ అయినా.. రెండు కుటుంబాలు రెగ్యులర్‌గా కలుసుకుంటున్నాయ్. నిజానికి ఆడపిల్ల అంటే ఎన్టీఆర్‌కు చాలా ఇష్టం. తనకు అమ్మాయి లేదన్న లోటు అలానే ఉండిపోయిందని చాలాసార్లు చెప్పాడు తారక్. ఇప్పుడు రాంచరణ్ కూతురును.. తన కూతురులా భావిస్తూ ఆయన గిఫ్ట్‌లు పంపించడం చూసి అభిమానులు
మురిసిపోతున్నారు.