NTR Ravi Teja : ‘దేవర’ డేట్ కి వస్తున్న రవితేజ..
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న 'దేవర' సినిమా దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కావాల్సి ఉండగా.. సెప్టెంబర్ 27కి ప్రీ పోన్ అయిన సంగతి తెలిసిందే.

Junior NTR starrer 'Devara' directed by Koratala Siva will release on October 10 as a Dussehra gift.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘దేవర’ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కావాల్సి ఉండగా.. సెప్టెంబర్ 27కి ప్రీ పోన్ అయిన సంగతి తెలిసిందే. దీంతో దసరా సీజన్ పై పలు సినిమాలు కన్నేస్తున్నాయి. ముఖ్యంగా అక్టోబర్ 10 పై రవితేజ మూవీ కర్చీఫ్ వేసినట్లు తెలుస్తోంది.
‘షాక్’, ‘మిరపకాయ్’ తరువాత రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ . పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవల విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇదిలా ఉంటే ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. తెలుగు సినిమాలకు సంక్రాంతి తరువాత పెద్ద పండుగ సీజన్ దసరానే. అలాంటిది ఈసారి దసరాకు తెలుగు సినిమాల తాకిడి లేదనే చెప్పాలి. ఈ క్రమంలో ‘మిస్టర్ బచ్చన్’ చిత్రం నిజంగానే దసరాకు వస్తే జాక్ పాట్ కొట్టినట్టే అవుతుంది.