Junior NTR Tweet : మామయ్యకు కంగ్రాట్స్…ఎన్టీఆర్ సంచలన ట్వీట్.. అస్సలు ఉహించలేదు

తెలుగు సినిమాకి దొరికిన ఒక గొప్ప వరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటనలో ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది. ప్రస్తుతం దేవర షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. అక్టోబర్ లో దేవర ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నిన్న జరిగిన ఎన్నికల ఫలితాల గురించి ట్వీట్ చేసాడు

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 5, 2024 | 04:21 PMLast Updated on: Jun 05, 2024 | 4:21 PM

Junior Ntr Tweet మామయ్యకు కంగ్రాట్స్ ఎ

తెలుగు సినిమాకి దొరికిన ఒక గొప్ప వరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటనలో ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది. ప్రస్తుతం దేవర షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. అక్టోబర్ లో దేవర ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నిన్న జరిగిన ఎన్నికల ఫలితాల గురించి ట్వీట్ చేసాడు.కూటమి భారీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండటంతో సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు ట్వీట్ చేయగా… లేట్ గా అయిన ఎన్టీఆర్ రియాక్ట్ అవ్వడం వైరల్ గా మారింది.

ప్రియమైన చంద్రబాబు నాయుడి మావయ్యకి చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అలాగే అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ కి మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, MPలుగా గెలిచిన భరత్ కి శుభాకాంక్షలు అని చెప్పాడు. అదే విధంగా బి జె పి తరుపున గెలిచిన పురందేశ్వరి అత్తకి అలాగే ఇంతటి ఘనవిజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని కూడా తెలియచేసాడు. ఇక ఈ ట్వీట్ తో ఎన్టీఆర్ అభిమానులతో పాటు మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

ఇదిలా ఉంటే… యంగ్ టైగర్ గత కొంత కాలంగా నందమూరి, నారా కుటుంబాలకు దూరంగా ఉంటున్నాడు. పైగా ఎన్నికల సమయంలో ఎవరికి సపోర్ట్ చేయలేదు. దీంతో చాలా ట్రోలింగ్ కే గురయ్యాడు. అయినప్పటికి పట్టించుకోకుండా సినిమాలతో బిజీగా గడిపేశాడు. ఇక ఫలితాల్లో నారా , నందమూరి ఫ్యామిలీ కుటుంబసభ్యులు విజయం సాధించడంతో తనదైన స్టైల్ రియాక్ట్ అయ్యాడు. అందరికి శుభాకాంక్షలు తెలిసి ఫ్యాన్స్ లో కొత్త జోష్ నింపాడు.