Ntr : మరో మల్టీస్టారర్ లో ఎన్టీఆర్
ఆర్ఆర్ఆర్' (RRR) తో గ్లోబల్ ఇమేజ్ సంపాదించుకొని వరుస భారీ సినిమాలలో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ .. ఈమధ్య ఎక్కువగా బాలీవుడ్ (Bollywood) హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు.

ఆర్ఆర్ఆర్’ (RRR) తో గ్లోబల్ ఇమేజ్ సంపాదించుకొని వరుస భారీ సినిమాలలో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ .. ఈమధ్య ఎక్కువగా బాలీవుడ్ (Bollywood) హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందుతోన్న ‘దేవర’ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. అలాగే ఎన్టీఆర్ (NTR) తన బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘వార్ 2’ (War 2) లో హృతిక్ రోషన్ (Hrithik Roshan) తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. అంతేకాదు, తన నెక్స్ట్ మూవీలో సైతం తారక్.. మరో బాలీవుడ్ హీరోతో కలిసి నటించబోతున్నాడట.
‘దేవర’, ‘వార్ 2’ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఆగస్టు లేదా సెప్టెంబర్ లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశముంది.
ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఇందులో ఎన్టీఆర్ కి ధీటుగా, ఆయనను ఢీ కొట్టే పాత్రలో ఓ బాలీవుడ్ హీరో కనిపించనున్నాడట. ఆ హీరో ఎవరు అనేది త్వరలోనే రివీల్ చేసే అవకాశముంది అంటున్నారు.