జూనియర్ ఎన్టీఆర్ వాచ్ ధర అన్ని కోట్లా.. ఆ బడ్జెట్ తో సినిమా తీయొచ్చు తెలుసా..!

ఇండస్ట్రీలో ఒక్కో హీరోకు ఒక్కో దాని మీద ప్యాషన్ ఉంటుంది. చిరంజీవికి కార్లు అంటే ఇష్టం.. మార్కెట్లోకి ఏ కొత్త కారు వచ్చిన ఇంటి ముందు ఉండాల్సిందే అంటాడు చిరు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 13, 2025 | 04:55 PMLast Updated on: Mar 13, 2025 | 4:55 PM

Junior Ntrs Watch Costs Crores Do You Know If You Can Make A Movie With That Budget

ఇండస్ట్రీలో ఒక్కో హీరోకు ఒక్కో దాని మీద ప్యాషన్ ఉంటుంది. చిరంజీవికి కార్లు అంటే ఇష్టం.. మార్కెట్లోకి ఏ కొత్త కారు వచ్చిన ఇంటి ముందు ఉండాల్సిందే అంటాడు చిరు. ఇక నాగార్జునకు కాఫీ అంటే పిచ్చి.. ఏ దేశం వెళ్లిన కూడా అక్కడి నుంచి మన దగ్గరికి తీసుకొచ్చేది కేవలం కాఫీ గింజలు మాత్రమే.. అలాగే నాగచైతన్య కూడా బైక్స్ ఎక్కువగా కోరుకుంటాడు.. రామ్ చరణ్ కు ఏమో బట్టలు అంటే పిచ్చి..! అలా జూనియర్ ఎన్టీఆర్ కు కూడా ఒక ప్యాషన్ ఉంది. అదే వాచ్ ల పిచ్చి. తారక్ కు వాచ్ లు అంటే చాలా ఇష్టం. అందుకే ఏ దేశానికి షూటింగ్ వెళ్లినా కూడా అన్నింటి కంటే ముందు వాచ్ కొంటాడు జూనియర్. ఇప్పుడు కూడా ఈయన చేతికి వాచ్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. నిజం చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ దగ్గర వాచ్ కలెక్షన్ చాలా ఉంది. ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో వాచీలు తెప్పించుకుంటూ ఉంటాడీయన.

పైగా ఎన్టీఆర్ కు తెలిసిన వాళ్ళు కూడా ఎక్కువగా ఆయనకు వాచ్ లే గిఫ్టుగా ఇస్తుంటారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ఏదైనా బ్రాండెడ్ కొత్త వాచ్ నచ్చిందంటే చాలు.. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టైనా దాన్ని కొనడం ఈ హీరోకు ఉన్న అలవాటు. తాజాగా మరో బ్రాండెడ్ వాచ్ పెట్టుకున్నాడు ఎన్టీఆర్. ఆ వాచ్ పుట్టు పూర్వోత్తరాలు అన్ని సోషల్ మీడియాలో పెట్టేసారు అభిమానులు. వార్ 2 షూటింగ్ కోసం ఈ మధ్య ఎక్కువగా ముంబైలోనే ఉంటున్నాడు తారక్. తాజాగా ఆయన ముంబై విమానాశ్రయంలో కనిపించాడు. అక్కడ తన కోసం వచ్చిన అభిమానులకు, మీడియా వాళ్లకు చెయ్యి ఊపి అభివాదం చేశాడు జూనియర్. అప్పుడు అందరి దృష్టి ఆయన చేతికి ఉన్న వాచ్ పై పడింది. ఈ అల్ట్రా మోడ్రన్ వాచ్ ధర ఎంత ఉంటుందబ్బా అని ఆరా తీసి.. తీరా రేట్ తెలిసిన తర్వాత షాక్ అవడం తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయింది వాళ్లకు.

ఎన్టీఆర్ ధరించిన ఈ వాచ్ రిచర్డ్ మిల్లే RM 40-01. ఈ వాచి ఖరీదు ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 7.47 కోట్లు..! ఏంటి.. నమ్మలేకపోతున్నారా.. కానీ ఇదే నిజం. వాచ్ కోసం ఏడున్నర కోట్లు అంటే చిన్న విషయం కాదు. ఈ బడ్జెట్ తో ఒక చిన్న సినిమా తీసేయొచ్చు. గతంలో RRR ప్రమోషన్స్ లోనూ పాటక్ ఫిలిప్ నాటిలస్ 5712 1/A మోడల్ వాచ్ పెట్టుకొని కనిపించాడు. దాని రేటు కోటి 56 లక్షల పైనే. ఇదంతా చూస్తుంటే అత్తారింటికి దారేదిలో క్లైమాక్స్ డైలాగ్ గుర్తుకొస్తుంది. అన్న మీ వాచ్ ఇస్తారా.. మా లైఫ్ సెట్ అయిపోద్ది అంటూ పవన్ కళ్యాణ్ తో అంటారు కమెడియన్స్. ఇప్పుడు ఎన్టీఆర్ ను కూడా ఇలాగే అడగాలేమో..!