Kalki trailer : కల్కి ట్రైలర్‌లో పూర్తి కథ
డైరెక్టర్ (Young Director) నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఓ అద్భుతాన్ని అవిష్కరించారని కల్కి ట్రైలర్ (Kalki trailer) చూస్తేనే అర్థం అవుతుంది. తెలుగు ప్రేక్షకుడు కనీవినీ ఎరగని ఓ ప్రపంచాన్ని సృష్టించాడు.

Just watching the trailer of Kalki will tell you that director Nag Ashwin has unleashed a miracle.
డైరెక్టర్ (Young Director) నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఓ అద్భుతాన్ని అవిష్కరించారని కల్కి ట్రైలర్ (Kalki trailer) చూస్తేనే అర్థం అవుతుంది. తెలుగు ప్రేక్షకుడు కనీవినీ ఎరగని ఓ ప్రపంచాన్ని సృష్టించాడు. మూడు నిమిషాల ట్రైలర్ కట్‌తో మనం తెలుగు సినిమానే చూడబోతున్నామా అనే ఆశ్చర్యాన్ని కల్పించాడు. ఇక సినిమా ఎలా ఉండబోతుందో మీరే ఊహించుకోండి అనే సవాల్ విసిరినట్టుంది. ట్రైలర్‌లో చూపించిన క్యారెక్టర్లు ఏంటి, కాంప్లెక్స్ సిటీలో ఎవరు ఉంటారు. ట్రైలర్ చూస్తే మనకు ఏం అర్థం అయిందో డిస్కస్ చేద్దాం.
కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) అనే పేరులోనే ఉంది. ఇది భవిష్యత్తులో జరగబోయే సినిమా అని. కల్కి కథ జరిగే సమయంలో ఈ భూమి మీద మిగిలి ఉన్న ఒకే ఒక్క నగరం కాశీ పట్టణం. అక్కడే సామాన్య మానవులు ఉంటారు. కాశీలో నివసించే పేద ప్రజలకు నీరు ఉండదు. ఆహారం ఉండదు. పేదరికంలో ఉంటారు. అక్కడే హీరో ప్రభాస్ భైరవ బతుకుతుంటాడు. ధనవంతులు మాత్రమే ఉండే నగరం కాంప్లెక్స్ సిటీ. ఇది ఆకాశంలో ఉండే రిచ్ సిటీ. అక్కడ ఉండే వారు కాశీ ప్రజలను నీటి కోసం, ఆహారం కోసం బానిసలుగా పని చేయించుకుంటారు. అదే సమయంలో కాశీలో కొంతమంది రెబల్స్ ఉంటారు. వారు కాంప్లెక్స్ సిటీలో ఉండే వారిపై కోపంతో ఉంటారు. వారికి ఎదురు తిరిగుతుంటారు. ఇక కాంప్లెక్స్ సిటీలో ఎదైనా వస్తువును దొంగలించి కాశి పట్టణంలో తిరిగే వారిని పట్టుకోమని బౌంటింగ్ హంటర్స్ కు డబ్బు ఆఫర్ చేస్తారు. భైరవ కూడా యూనిట్స్ కోసం బౌంట్ హంటింగ్ చేస్తుంటాడు. ఆ సమయంలో కరెన్సీని రూపాయితో కాకుండా యూనిట్స్ తో పిలుస్తారు.
ఇక భైరవకు ఉన్న ఏకైక గోల్ బాగా డబ్బులు సంపాదించి కాంప్లెక్స్ సిటీలో సెటిల్ కావాలని. ఆ సమయంలో 1 మిలియన్ యూనిట్స్ అనే ఆఫర్ వస్తుంది. అది ప్రియంకను పట్టుకోవడం కోసం. ఈ భూమి మీద ఉండే ప్రజలకు దేవుడు ఒక్కడే అతడే సుప్రీం యాస్కిన్ అనే డైలాగ్ ఉంటుంది ట్రైలర్‌లో. సుప్రీం యాస్కిన్‌ను అంతం చేసి, ఈ భూమిని కాపాడడానికి పుట్టే వాడే కల్కి. అతన్ని పుట్టకుండా అడ్డుకునేందు చేసేదే ప్రాజెక్ట్ కే అని అర్థం అవుతుంది. ఈ ప్రాజెక్ట్ ను కలి పురుషుడు అయిన కమల్ హాసన్ తన మనుషులతో చేయిస్తాడు. అందులో భాగంగానే గర్భంతో ఉన్న స్త్రీలను కిడ్నాప్ చేస్తారు. ఏ చిన్నపిల్లోడైనా కల్కి కావచ్చు అని వాళ్లను చంపేస్తారు. అలాంటి సమయంలో దీపకను అశ్వథ్థామా రక్షిస్తాడు. కాంప్లెక్స్ సిటీనుంచి బయటకు తీసుకోస్తాడు. దాంతో దీపికను పట్టుకొచ్చిన వారికి 1 మిలియన్ యూనిట్స్ అనే భారీ ఆఫర్ రావడంతో భైరవ తన కోసం వస్తాడు. అక్కడే అశ్వథ్థమా, భైరవకు ఫైట్ కూడా జరుగుతుంది.