Kajal Aggarwal: తమన్నా, శృతి బాటలో నడుస్తున్న కాజల్
కాజల్, తమన్నా, శ్రుతి హాసన్ లాంటి హీరోయిన్లకు యంగ్ హీరోల మూవీల్లో ఆఫర్స్ రావట్లేదు. దీంతో వాళ్లకి, వీళ్లు.. వీళ్లకి వాళ్లు అన్నట్లు ఒకరికొకరు బానే సరిపోయారు. శ్రుతి హసన్ మొన్న చిరుతో వాల్తేర్ వీరయ్య, బాలయ్యతో వీర సింహారెడ్డి చేసింది.

Kajal Aggarwal: కాజల్ ఇప్పడు నాగార్జునతో జోడీకడుతోంది. మలయాళ మూవీ రీమేక్‌కి నాగ్ సై అనటం, అందులో తనకు జోడీగా కాజల్ కుదిరిపోవటం జరిగింది. ఐతే ఇక్కడ విచిత్రం ఏంటంటే నాగ్, చిరు, బాలయ్య, వెంకీ, రజినీ లాంటి సీనియర్లకు హీరోయిన్లు దొరకట్లేదు. అలానే కాజల్, తమన్నా, శ్రుతి హాసన్ లాంటి హీరోయిన్లకు యంగ్ హీరోల మూవీల్లో ఆఫర్స్ రావట్లేదు. దీంతో వాళ్లకి, వీళ్లు.. వీళ్లకి వాళ్లు అన్నట్లు ఒకరికొకరు బానే సరిపోయారు.
శ్రుతి హసన్ మొన్న చిరుతో వాల్తేర్ వీరయ్య, బాలయ్యతో వీర సింహారెడ్డి చేసింది. తమన్నా భోళా శంకర్ అంటూ చిరుతో, జైలర్ అంటూ రజినీతో సినిమాలు చేసింది. ఇక ఎఫ్-2, ఎఫ్-3లో వెంకీతో జోడీ కట్టిన తమన్నా, నాగార్జునతో జోడీకట్టడానికి ఎప్పుడో సిద్దమంది. కాజల్ అయితే భగవంత్ కేసరిలో బాలయ్య సరసన మెరుస్తూనే, నాగార్జునతో సినిమాకు సై అంది. పొరింజు మరియం జోసఫ్ తెలుగు రీమేక్‌లో బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. 35 దాటాక హీరోయిన్లెవరైనా సీనియర్ సిటిజన్‌లకు ప్రేయసిగా మారాల్సిందే అనేలా, 60 ప్లస్ హీరోలతో సినిమాలు చేస్తూ బిజీ అవుతున్నారు ఈ లేడీస్. యంగ్ హీరోలతో ఆఫర్లు లేక సీనియర్లతో సర్దుకుపోతున్నారు.