Kajal Aggarwal: కాజల్‌కి వయసు పెరగదా.. ఏంటి సీక్రెట్‌..

రీ ఎంట్రీలోనూ హీరోయిన్‌గా వరుస ఆఫర్స్‌తో దూసుకుపోతోంది కాజల్ అగర్వాల్. లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన బ్యూటీ కాజల్. తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో నటించింది. టాప్ హీరోయిన్‌గా ఫోకస్ అయింది. 50 సినిమాలు చేసిన హీరోయిన్‌గా రికార్డ్ సృష్టించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 23, 2023 | 03:52 PMLast Updated on: Oct 23, 2023 | 3:52 PM

Kajal Aggarwal Getting Offers In Second Innings

Kajal Aggarwal: ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కసారి ఫేడవుట్ అయితే హీరోయిన్‌గా ఛాన్సులు రావు. పెళ్లై సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తే.. చిన్నా చితక ఆఫర్స్‌తో సరిపెట్టుకోవాలి. కానీ, ఈ విషయంలో తన రూటే సెపరెట్ అంటోంది హాట్ బ్యూటీ కాజల్. రీ ఎంట్రీలోనూ హీరోయిన్‌గా వరుస ఆఫర్స్‌తో దూసుకుపోతోంది కాజల్ అగర్వాల్. లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన బ్యూటీ కాజల్. తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో నటించింది. టాప్ హీరోయిన్‌గా ఫోకస్ అయింది. 50 సినిమాలు చేసిన హీరోయిన్‌గా రికార్డ్ సృష్టించింది.

కానీ అందరికి ట్విస్ట్ ఇస్తూ కరోనా టైంలో పెళ్లి చేసుకొని సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. బాబు పుట్టిన తర్వాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస ప్రాజెక్ట్స్‌తో దూసుకుపోతోంది. టాలీవుడ్‌లో ప్రజెంట్ కాజల్‌కి ఫుల్ డిమాండ్ ఉంది. బాలయ్యతో చేసిన భగవంత్ కేసరి హిట్ అవ్వడంతో గ్రాండ్ రీ ఎంట్రీ దక్కింది. అలాగే కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న ఇండియన్2లో ఒక హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం పొస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు రానుంది.

అలాగే సత్యభామ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ కూడా చేస్తోంది. ఇది తెలుగు, తమిళ్‌లో రిలీజ్ కానుంది. ఇవికాక తనకి కథలు చెప్పడానికి అరడజన్ మంది దర్శకులు చర్చలు జరుపుతున్నారు. వీటిలో ఏ రెండు ఓకే అయినా వచ్చే రెండుళ్లు ఈ బ్యూటీ ఫుల్ బిజీగా ఉండే ఛాన్స్ ఉంది. మొత్తానికి సెకండ్ ఇన్నింగ్స్‌లో కాజల్ క్రేజీ లైనప్ కుర్ర బ్యూటీస్‌కే షాక్ ఇస్తోంది.