Kajal: సినిమాకు గుడ్‌బై చెప్పనున్న కాజల్..
టాలీవుడ్ చందమామ కాజల్ గురించి పరిచయం అవసరం లేదు. అందంతో, అభినయంతో ఓ దశాబ్దం పాటు తెలుగు సినిమాను ఏలిందీ బ్యూటీ. లక్ష్మీ కల్యాణం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన కాజల్.. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Kajal Agarwal Stop To Her Film Career
పెళ్లై.. ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా వరుస సినిమాలతో అదరగొడుతున్నారు. ఐతే సినిమాలకు పూర్తిగా గుడ్‌బై చెప్పాలని కాజల్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయ్. కాజల్ సినిమాలకు గుడ్‌బై చెప్పటానికి ప్రధాన కారణం ఆమె కొడుకు అని తెలుస్తోంది. సినిమాల్లో బిజీ అయిపోవటం వల్ల బాబుకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వస్తోందని కాజల్ భావిస్తోందట.
బాబు ఎదుగుతున్న వేళ.. అతడికి తల్లి ప్రేమను అందించాలని నిర్ణయించుకుందని టాక్. భర్త కిచ్లూ కూడా ఇదే మాట అన్నాడట. కాజల్ సినిమాలకు దూరం అయ్యే విషయంపై త్వరలో క్లారిటీ రానుందని సమాచారం. కాజల్ ప్రస్తుతం ఇండియన్ 2 చిత్రంలో నటిస్తోంది. కొద్దిరోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాజల్‌కు ఇదే చివరి సినిమా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయ్.
పెళ్లి అయి.. బాబు పుట్టిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కాజల్‌కు.. భారీ హిట్ దక్కలేదు. వచ్చిన సినిమాలన్నీ దాదాపుగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయ్. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న పెద్ద సినిమా, ఒకే ఒక్క సినిమా ఇండియన్ 2 మాత్రమే. ఇదే కాజల్‌కు ఆఖరు సినిమా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయ్. మరి కాజల్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.