Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ ఫ్యూచరేంటి..?
సమంత, తమన్నా, శ్రుతితో పోలిస్తే కాజల్ ఫ్యూచరే గందరగోళంగా ఉంది. గతంలో ఉన్న గ్లామర్ ఇప్పుడు కాజల్‌కు లేదు. భగవంత్ కేసరి హిట్ అవుతుందో లేదో ఇప్పుడే చెప్పలేం. రిజల్ట్ ఎలా వచ్చినా కాజల్ ఫ్యూచర్ మాత్రం ఈ సినిమాలో తనకొచ్చే పేరును బట్టే ఉంటుంది.

Kajal Aggarwal: సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రజెంట్ అనిల్ రావిపుడి దర్శకత్వంలో నటసింహం బాలయ్యతో జోడీ కట్టింది. భగవంత్ కేసరి మూవీ పూర్తి చేస్తోంది. దసరాకు ఈ సినిమా రాబోతోంది. కాకపోతే ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా, తన ఫ్యూచర్ ఎలా ఉండబోతోందన్న ప్రశ్నే హాట్ టాపిక్ అయ్యింది. కాజల్ సినిమాల్లోకి వచ్చిన టైంలో తమన్నా, శ్రుతి హాసన్, సమంత కూడా ఎంట్రీ ఇచ్చారు. వీళ్లలో సమంత పెళ్లి తర్వాత డివోర్స్, ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ చూసింది. ప్రస్తుతం మయోసైటిస్‌తో పోరాడుతోంది.
అనారోగ్య సమస్య తప్ప కెరీర్ పరంగా సమంతని మరే సమస్య ఇబ్బంది పెట్టట్లేదు. హిందీలో సినిమాలు, వెబ్ సీరీస్‌ల ఆఫర్స్‌కి కొదువ లేదు. కాని తనే మయోసైటిస్ చికిత్సకోసం ఏడాది బ్రేక్ తీసుకుంటోంది. ఇక శ్రుతి హాసన్ విషయానికొస్తే, తను వాల్తేర్ వీరయ్యతో బ్లాక్ బస్టర్‌ని, వీర సింహారెడ్డితో యావరేజ్ హిట్‌ని సొంతం చేసుకుంది. అచ్చంగా తమన్నా కూడా అలానే ఈ సీజన్‌లో భోళ శంకర్, జైలర్‌తో దాడి చేసింది. ఏజ్‌బార్ స్టేజ్‌లో జైలర్‌లాంటి బ్లాక్ బస్టర్‌తో ఫ్యూచర్‌ని ఇంకాస్త ఎక్స్‌టెండ్ చేసుకుంది. సో తమన్నా ఫ్యూచర్‌కి ఏ ఢోకా లేదు. రెండు హిట్ల తర్వాత సలార్‌తో రాబోతోంది కాబట్టి, దానికి సీక్వెల్ ఛాన్స్ ఉందని తేలింది కాబట్టి మరో రెండేళ్ల వరకు శ్రుతికి నో ప్రాబ్లమ్. సో సమంత, తమన్నా, శ్రుతితో పోలిస్తే కాజల్ ఫ్యూచరే గందరగోళంగా ఉంది.
గతంలో ఉన్న గ్లామర్ ఇప్పుడు కాజల్‌కు లేదు. భగవంత్ కేసరి హిట్ అవుతుందో లేదో ఇప్పుడే చెప్పలేం. రిజల్ట్ ఎలా వచ్చినా కాజల్ ఫ్యూచర్ మాత్రం ఈ సినిమాలో తనకొచ్చే పేరును బట్టే ఉంటుంది. లేదంటే చాప్టర్ క్లోజ్ అంటున్నారు సినీ విశ్లేషకులు. అసలు తన గ్లామర్ ఆవిరవ్వటమే కాదు, తన ఫేస్ లుక్ కూడా మారిపోవటమే ఈ కామెంట్లకి కారణమౌతోంది.