Kajal Aggarwal: కాజల్ డీప్ ఫేక్ వీడియో.. ఇలా మార్ఫింగ్ చేశారేంట్రా..?
ఈమధ్యే హీరోయిన్ రష్మిక మందన్నను అసభ్యకరంగా చూపిస్తూ డీప్ ఫేక్ వీడియో రిలీజ్ అయింది. ఆ వీడియో తయారు చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయినా కూడా సినిమా హీరోయిన్లను టార్గెట్‌గా చేసుకొని.. మళ్ళీ కొత్త వీడియోలు పుట్టుకొస్తూనే ఉన్నాయి.

Kajal Aggarwal: పోలీసులు కేసులు పెడుతున్నా హీరోయిన్ల డీప్ ఫేక్ వీడియోలు మాత్రం ఆగడం లేదు. లేటెస్ట్‌గా నటి కాజల్ అగర్వాల్ డీప్ ఫేక్ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఈమధ్యే హీరోయిన్ రష్మిక మందన్నను అసభ్యకరంగా చూపిస్తూ డీప్ ఫేక్ వీడియో రిలీజ్ అయింది. ఆ వీడియో తయారు చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
SS RAJAMOULI: నెక్ట్స్ ఏంటి..? రాజమౌళిలానే భయపడుతున్నారు
అయినా కూడా సినిమా హీరోయిన్లను టార్గెట్‌గా చేసుకొని.. మళ్ళీ కొత్త వీడియోలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. రష్మిక వీడియో వచ్చినప్పుడే ఇలాంటివి మళ్ళీ జరక్కుండా కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వచ్చింది. రాజకీయ నేతలు, సినీ ప్రముఖులంతా రష్మికకు అండగా నిలిచారు. ఇలాంటి వీడియోలపై కఠినమైన శిక్షలు ఉండాలని డిమాండ్ చేశారు. లేటెస్ట్‌గా కాజల్ అగర్వాల్ కూడా డీప్ ఫేక్ వీడియో బారిన పడింది. కాజల్ ఫేస్‌ను మార్ఫింగ్ చేసి.. అభ్యంతరకరంగా కనిపిస్తున్న వీడియో బయటకు వచ్చింది. కాజల్ అందాలను ప్రదర్శిస్తున్నట్టుగా ఈ వీడియోలో చూపించారు.
పింక్ కలర్ డ్రెస్సులో కాజల్ వీడియోను చాలా అసభ్యకరంగా మార్ఫింగ్ చేశారు. ఈ వీడియో రూపొందించిన వారిపై చర్యలు తీసుకోవాలని అభిమానులు కోరుతున్నారు. మళ్ళీ ఇలాంటివి క్రియేట్ చేయకుండా పోలీసులు కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు.