Kajal Aggarwal: ఎవర్రా మీరంతా.. కాజల్ కొడుకు మాములోడు కాదుగా..
క్యూట్‌గా కనిపిస్తోన్న నీల్ కిచ్లూ.. ఫొటోగ్రాఫర్లు తనను క్లిక్ చేసినప్పుడు వారి వైపు చూస్తూ ఉన్నాడు. వీళ్లంతా ఎవరో అని చిన్న కళ్లతో ఆశ్చర్యంగా చూస్తున్నట్టు అనిపించింది. అంతేకాక ఎవర్రా మీరంతా అన్నట్లుగా, కోపంగా, చిరాకుగా చూస్తున్నట్లుగా ఫోజులిచ్చాడు బుడ్డోడు.

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ తన ముద్దుల కొడుకు నీల్‌తో కలిసి ఎయిర్ పోర్ట్‌లో మెరిసింది. ముద్దుల కొడుకుతో కనిపించగానే వెంటనే ఫొటోలు, వీడియోలను క్లిక్ చేసేందుకు ఫోటోగ్రాఫర్లు గుమిగూడారు. కెమెరాలన్నీ ఒక్కసారిగా క్లిక్ చేస్తూ ఉండటంతో నీల్ రియాక్షన్ అందరి దృష్టిని ఆకర్షించింది. క్యూట్‌గా కనిపిస్తోన్న నీల్ కిచ్లూ.. ఫొటోగ్రాఫర్లు తనను క్లిక్ చేసినప్పుడు వారి వైపు చూస్తూ ఉన్నాడు. వీళ్లంతా ఎవరో అని చిన్న కళ్లతో ఆశ్చర్యంగా చూస్తున్నట్టు అనిపించింది.
అంతేకాక ఎవర్రా మీరంతా అన్నట్లుగా, కోపంగా, చిరాకుగా చూస్తున్నట్లుగా ఫోజులిచ్చాడు బుడ్డోడు. ఈ సమయంలో కాజల్ స్లింగ్ బ్యాగ్‌తో బ్లాక్ డ్రెస్ ధరించగా, ఆమె కొడుకు వైట్ డ్రెస్సులో అందంగా కనిపించాడు. కాజల్, గౌతమ్ కిచ్లును కొన్నేళ్లక్రితం పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన బ్యూటీ మే 19, 2022న నీల్ కిచ్లు అనే మగబిడ్డకు జన్మనిచ్చింది. గత ఏడాది అక్టోబర్‌లో ఆమె తన కొడుకు ముఖాన్నిచూపించింది. ఈ ఏప్రిల్‌లో, ఈ జంట తమ కుమారుడు నీల్ మొదటి పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన కొడుకు ఫొటోను షేర్ చేసిన కాజల్.. అతనికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేసింది. ప్రజెంట్ కాజల్.. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తోన్న ‘భారతీయుడు 2’లో నటిస్తోంది. ఇందులో సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, గురు సోమసుందరంతో పాటు ఇతరులతో సహా స్టార్-స్టడెడ్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న బాలకృష్ణ నెక్ట్స్ మూవీ ‘భగవంత్ కేసరి’లో కూడా కాజల్ నటిస్తోంది. త్వరలోనే ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి దసరాకు విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘సత్యభామ’ అనే ఫీమేల్ లీడ్ చిత్రం కూడా కాజల్ ఇటీవలే ప్రకటించింది. ఇందులో ఆమె పోలీసు పాత్రను పోషిస్తోంది. ఈ చిత్రం ఆమె సినీ కెరీర్‌లో 60వ చిత్రంగా రాబోతోంది.