Kajal And Nayanatara: ఖాకీ డ్రెస్‌కు కలర్ అద్దుతోన్న గ్లామర్ భామలు
డ్రెస్ లందు ఖాకీ డ్రెస్ వేరయా అంటారు.. హీరో పోలీస్ ఐతే సినిమా బ్లాక్ బస్టర్. మరి హీరోయిన్ పోలీస్ అయితేనో.. గ్లామర్తో సినిమాకి కొత్త కలర్ ఇచ్చే కథానాయికలు.. ఖాకి డ్రెస్‌కి కూడా సూపర్ గ్లామర్ తీసుకొస్తున్నారు.

Nayanatara And Kajal Make Police Officer Role In Upcoming Projects
లేటెస్ట్ గా ఈ లిస్టులోకి టాలీవుడ్ అందాల చందమామ కాజల్ కూడా జాయిన్ అయ్యారు. సత్యభామ సినిమాలో ఆమె పోలీస్ ఆఫీసర్‌లా మెరవనుంది. అంతెందుకు పాన్ ఇండియా మూవీ జవాన్‌లో క్యూట్ బ్యూటీ నయనతార పోలీస్ ఆఫీసర్ రోల్‌లో సెప్టెంబర్ 7 న థియేటర్స్ లో ఏ రేంజ్ రచ్చ చేస్తుందో వేచి చూడాలి. ఆ మధ్య వచ్చిన శాకినీ డాకినీ సినిమాలో.. స్వీట్ బేబీస్ రెజీనా అండ్ నివేదా థామస్ పోలీస్ పాత్రల్లో ఫుల్ టూ గ్లామర్ పంచారు. మన చంద్రముఖి ఆంటీ జ్యోతిక కూడా ఝాన్సీ మూవీలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా దుమ్ము రేపింది .
ఇక హాట్ బ్యూటీ రాశిఖన్నా సుప్రీమ్ మూవీ లో సుబ ఇన్స్పెక్టర్ శ్రీదేవిగా సరదాలు పంచింది . క్షణం తీరిక లేకుండా అటు యాంకర్ గా ఇటు ఆర్టిస్ట్ గా చేస్తోన్న యాంకరమ్మ అనసూయ.. క్షణం సినిమాలో పోలీస్ డ్రెస్‌కే చమటలు పట్టించింది. కొంచం ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తే.. శారదా, విజయశాంతి, సుహాసిని, టబు లాంటి ఎందరో ఖాకి డ్రెస్ కి కొత్త కలర్ ఇచ్చారు. ప్రెజెంట్ డేస్‌లో తమన్నా, కీర్తి సురేష్, అమలాపాల్ , ప్రియాంక చోప్రా లాంటి ఎందరో గ్లామర్ గర్ల్స్ ఖాకి డ్రెస్ కి కొత్త కాలర్ అందించి ఆకట్టుకుంటున్నారు