రికార్డుల కోసం కక్కుర్తి.. పుష్ప మళ్ళీ వరస్ట్ డెసిషన్
లాస్ట్ ఇయర్ అల్లు అర్జున్ కెరీర్ లోనే వేరే స్పెషల్ ఇయర్ గా చెప్పుకోవాలి. పుష్ప సినిమాతో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ హిట్ కొట్టాడు పుష్ప. ఇప్పటివరకు అల్లు అర్జున్ అంటే నేషనల్ మాత్రమే అనుకునే వాళ్లకు ఇంటర్నేషనల్ అని ప్రూవ్ చేశాడు.
లాస్ట్ ఇయర్ అల్లు అర్జున్ కెరీర్ లోనే వేరే స్పెషల్ ఇయర్ గా చెప్పుకోవాలి. పుష్ప సినిమాతో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ హిట్ కొట్టాడు పుష్ప. ఇప్పటివరకు అల్లు అర్జున్ అంటే నేషనల్ మాత్రమే అనుకునే వాళ్లకు ఇంటర్నేషనల్ అని ప్రూవ్ చేశాడు. వరల్డ్ వైడ్ గా భారీ బుకింగ్స్ ఈ సినిమా కోసం జరిగాయి. ఇక మన తెలుగులో కూడా ఈ సినిమా దుమ్మురేపింది. నార్త్ ఇండియాలో అయితే సినిమా క్రేజ్ కు బాలీవుడ్ కూడా పిచ్చోళ్ళు అయిపోయారు. దాదాపు 850 కోట్లు నెట్ వసూళ్లు బాలీవుడ్లో సాధించింది పుష్ప.
ఇక మన తెలుగులో కూడా ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకుంది. తెలుగు కంటే కూడా హిందీలోనే జనాలు ఈ సినిమాను ఎక్కువగా ఇష్టపడ్డారు. ఇక లాస్ట్ ఇయర్ ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఒకరోజు జైల్లో కూడా గడపాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా గురించి మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు. బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లు భారీగా లాగడానికి ప్లాన్ చేస్తూ సంక్రాంతి కానుకగా పుష్ప పార్ట్ 2 రీలోడెడ్ వర్షన్ థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సినిమాకు 20 నిమిషాలు యాడ్ చేస్తూ పవర్ ఫుల్ సీన్స్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు.
ఈ విషయాన్ని సినిమా యూనిట్ పోస్టర్ ద్వారా బయటపెట్టింది. పుష్ప దీ రూల్ 20 నిమిషాల అదనపు సన్నివేశాలతో రీలోడెడ్ వర్షన్ రెడీగా ఉందని… జనవరి 11 నుంచి మూవీ రిలీజ్ అయిన థియేటర్స్ లో చూడవచ్చని… వైల్డ్ ఫైర్ ఇప్పుడు మరింత ఫైరీగా ఉండబోతుందంటూ సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా మూడు గంటల 20 నిమిషాల 38 సెకండ్లు ఉంది. తాజాగా మరో 20 నిమిషాలు యాడ్ చేస్తే… మూడు గంటల 40 నిమిషాలు దాటే ఛాన్స్ ఉంది. అంటే ఇంటర్వెల్ తో కలిపి దాదాపు నాలుగు గంటల పాటు పుష్ప సినిమా ఉంటుంది.
ఒకవైపు భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అవుతుంటే 20 నిమిషాలు యాడ్ చేసి వాళ్లకు సవాల్ చేశాడు అల్లు అర్జున్. సంక్రాంతి కానుకగా మూడు సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. ఇప్పటికే బాహుబలి రికార్డులను కూడా ఈ సినిమా బ్రేక్ చేసింది. బాహుబలి 1810 వసూలు చేస్తే 32 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 1831 కోట్ల గ్రాస్ వసూలు చేసింది పుష్పా 2 టీం. ఇప్పుడు మళ్లీ రిపీటెడ్ ఆడియన్స్ టార్గెట్ గా ఎక్స్ట్రా సీన్లను యాడ్ చేశారు. అయితే భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ ఉండటంతో ఈ సినిమాకు థియేటర్లు ఏ స్థాయిలో కేటాయిస్తారు అనేది క్లారిటీ లేదు. ఇప్పటికే తెలుగులో సినిమాకు అంత పాజిటివ్ గా వాతావరణం అయితే కనపడటం లేదు. హిందీలో మాత్రమే సినిమాకు గ్రేస్ కనబడుతోంది. మన తెలుగు రాష్ట్రాల్లో గేమ్ చేంజర్ హవా నడుస్తోంది. మరి 20 నిమిషాలు యాడ్ చేయడం సినిమాకు ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి.