స్పిరిట్ కంటే ముందుగా కల్కీ 2.. కర్ణ 3102B.C.కానీ కండీషన్…

రెబల్ స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ ఫైనల్ షెడ్యూల్ కి ముందే ఫౌజీతో బిజీ అయ్యాడు. ఏకంగా 20 రోజులు ఈ సినిమా షూటింగ్ కే కేటాయించి, ఆ పనుల్లోనే బిజీ అయ్యాడు. ఇలాంటి టైంలో కల్కీ 2 ప్రాజెక్టులో కదలిక వచ్చింది. జూన్ నుంచే కల్కీ 2 షూటింగ్ షురూ అయ్యేలా ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 28, 2025 | 06:15 PMLast Updated on: Jan 28, 2025 | 6:15 PM

Kalki 2 Before Spirit Karna 3102b C But Condition

రెబల్ స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ ఫైనల్ షెడ్యూల్ కి ముందే ఫౌజీతో బిజీ అయ్యాడు. ఏకంగా 20 రోజులు ఈ సినిమా షూటింగ్ కే కేటాయించి, ఆ పనుల్లోనే బిజీ అయ్యాడు. ఇలాంటి టైంలో కల్కీ 2 ప్రాజెక్టులో కదలిక వచ్చింది. జూన్ నుంచే కల్కీ 2 షూటింగ్ షురూ అయ్యేలా ఉంది. నిజానికి జూన్ లో సందీప్ రెడ్డి వంగ మూవీ, స్పిరిట్ షూటింగ్ మొదలవ్వాలి. అలానే ప్లాన్ చేశారు. కేవలం ఫౌజీ వల్లే సంక్రాంతికి మొదలవ్వాల్సిన స్పిరిట్, జూన్ కి షిఫ్ట్ చేశారన్నారు. ఇప్పుడు కల్కీ 2 వల్ల మళ్లీ స్పిరిట్ షూటింగ్ ఇంకాస్త ముందుకి వాయిదా పడుతుందా అంటే, ఛాన్సే లేదు… పక్కగా స్పిరిట్ మూవీ జూన్ లోనే మొదలౌతుంది. రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలౌతుంది. మరెలా జూన్ లోనే కల్కీ 2 షూటింగ్ సాధ్యం అవుతుంది…? అక్కడే ట్విస్ట్ ఇచ్చాడు నాగ్ అశ్విన్. ఏకంగా సందీప్ రెడ్డి వంగనే కన్విన్స్ చేశాడు. స్పిరిట్ షూటింగ్ ని వాయిదా వేయకుండా, కల్కీ2ని మొదలు పెట్టేలా తన ప్లానింగ్ తో మతిపోగొడుతున్నాడు… అదెలానో చూసేయండి.

రెబల్ స్టార్ ప్రభాస్ కల్కీ2 జూన్ థర్ట్ వీక్ లేదంటే లాస్ట్ వీక్ సెట్స్ పైకెళ్లేలా కనిపిస్తోంది. ఆల్రెడీ స్క్రీప్ట్ వర్క్ పూర్తైంది. ప్రీ ప్రొడక్షన్ పనులను షురూ చేశాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. కాని రియాలిటి చూస్తే ఫౌజీ కోసం 20 రోజులు డేట్లిచ్చి, ఆతర్వాత ది రాజా సాబ్ పెండింగ్ షూటింగ్ పూర్తి చేసేందుకు ప్రభాస్ రెడీ అయ్యాడు.

ఇలాంటి టైట్ షెడ్యూల్స్ కి తోడు జూన్ లో స్పిరిట్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని ప్లాన్ చేశాడు సందీప్ రెడ్డి వంగ. సంక్రాంతికి సినిమాను లాంచ్ చేసి ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ అనుకున్నారు. కుదిరితే మార్చ్ లోనే మొదలు పెట్టాలనకున్నారు.కాని ఫౌజీ లో ప్రభాస్ లుక్ కి, స్పిరిట్ లో రెబల్ స్టార్ లుక్ కి చాలా మార్పు ఉంటుంది. కాబట్టి ఒకే సారి ప్యార్ లల్ గా రెండు మూవీలు తెరకెక్కడం కష్టం.

అందుకే మే వరకు ఆగేందుకు సందీప్ రెడ్డి వంగ సిద్దమయ్యాడు. కట్ చేస్తే మే ఎండ్ లేదంటే జూన్ లోస్పిరిట్ షూటింగ్ షురూ అనుకుంటే, సీన్ లోకి నాగ్ అశ్విన్ వచ్చాడు. కల్కీ 2 ని పట్టాలెక్కిస్తున్నాడు. హను రాఘవపూడీకోసం ఆగిన సందీప్ మళ్లీ నాగ్ అశ్విన్ కోసం ఆగే పరిస్థితి ఉండదు. ఎందుకంటే స్పిరిట్ ని పూర్తి చేసి యానిమల్ పార్క్ ను కూడా పట్టాలెక్కించాల్సిన అవసరం సందీప్ కి ఉంది.

కాబట్టి కల్కీ 2 కోసం స్పిరిట్ మూవీని సైడ్ చేసే చాన్సేలేదు. అయినా ఆ అవసరం లేదంటున్నాడు నాగ్ అశ్విన్. ఎందుకంటే స్పిరిట్, కల్కీ 2 రెండూ ప్యార్ లల్ గా తెరకెక్కిస్తారట. అదే నిజమైతే ప్యార్ లల్ గా రెండు మూవీలు తీసే వీలుంటే, ఫౌైజీతో పాటే స్పిరిట్ ని సందీప్ తీసేవాడు. కాని అక్కడ కుదరంది ఇక్కడ ఎలా కుదురుతుంది? అక్కడే ట్విస్ట్ ఉంది. నిజంగా ఇది కుదిరేలా ఉంది.

ఎందుకంటే కల్కీ 2 మూవీ స్టోరీ లైన్ కర్ణ 3102B.C.అంటే కర్ణుడిగా ప్రభాస్ పాత్ర మీదే 80 శాతం షూటింగ్ ఉంటుంది. అంటే లాంగ్ హేయిర్ తాలూకు విగ్ తోనే పని… కాబట్టి స్పిరిట్ కోసం ప్రభాష్ ఏ లుక్ ని మార్చుకున్నా, ఆలుక్ కి విగ్ వేసి కల్కీ 2 ప్లాన్ చేస్తానన్నాడట నాగ్ అశ్విన్. ఇక భైరవ పాత్ర తాలూకు షూటింగ్ ని, స్పిరిట్ టాకీ పార్ట్ పూర్తయ్యాక ప్లాన్ చేస్తాడట. ఇలా పక్కా అడ్జెస్టింగ్ ప్లాన్ తో నాగ్ అవ్విన్ కల్కీ 2 ని పట్టాలెక్కించబోతున్నాడు. ముందుగా కమల్, దీపికా పదుకొనే కాంబినేషన్ సీన్లు తీసేందుకు ప్రిపరేషన్ లో ఉన్నాడు.