KALKI 2898 AD: కల్కి.. రాజా సాబ్‌కి.. ఆ డేట్ల మీద చిన్న డౌట్..?
కల్కి మే 9కి వస్తోందంటేనే అది ప్రభాస్ మీద ప్రెజర్ పెంచి ఫిక్స్ చేసిన డేట్ అంటున్నారు. తన ప్రతీ మూవీకి మధ్య గ్యాప్ మరీ ఎక్కువ ఉండొద్దనే ఏప్రిల్ 12కి కల్కిని రిలీజ్ చేయాలని ప్రభాస్ ఫిక్స్ అయ్యాడట.
KALKI 2898 AD: రాజాసాబ్.. ఇది మారుతి మేకింగ్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ చేయబోయే సినిమాకి ఫిక్స్ చేశామని చెబుతున్న టైటిల్. రాజా డీలక్స్, అంబాసిడర్, రాయల్.. ఇలా చాలా పేర్లే పరిశీలించారు. ఫైనల్‌గా రాజా సాబ్ అని ఫిక్స్ చేశారు. అంతే కాదు సెప్టెంబర్ రిలీజ్ కూడా రంగం సిద్దమౌతోంది. సెప్టెంబర్ 09కి విడుదల అని ఓ డేట్ కూడా లాక్ చేశారట. అసలా డేట్ స్పెషాలిటీ ఏంటి, పండగలున్నాయా, లేదంటే మరొకటా అన్న క్లారిటీ లేదు. అక్కడే ప్రభాస్‌కి డౌట్ల గేట్ తెరుచుకుందట.
GUNTUR KAARAM: సూపర్ స్టార్ మహేశ్‌ను ముంచిన త్రివిక్రమ్..
ఆల్రెడీ కల్కి మే 9కి వస్తోందంటేనే అది ప్రభాస్ మీద ప్రెజర్ పెంచి ఫిక్స్ చేసిన డేట్ అంటున్నారు. తన ప్రతీ మూవీకి మధ్య గ్యాప్ మరీ ఎక్కువ ఉండొద్దనే ఏప్రిల్ 12కి కల్కిని రిలీజ్ చేయాలని ప్రభాస్ ఫిక్స్ అయ్యాడట. ఈలోపు వైజయంతీ బ్యానర్ మే 9 తమకి కలిసొచ్చిందని ఆ ముహుర్తం చూసుకున్నారు. ఇది మొదటి నుంచి ప్రచారంలో వినిపించిన రిలీజ్ డేటే. కాకపోతే మే 9న మహానటి వచ్చి సెన్సేషనల్ హిట్టైందంటున్నారు. కాని, అదే డేట్ వెనకాల బ్యాడ్ లక్ కూడా దాగుంది. అదే డేట్‌కి వచ్చిన శక్తి భయంకరమైన డిజాస్టర్ అని తేలింది. ఎన్టీఆర్ కెరీర్‌లోనే మాయని మచ్చగా మారింది. ఇక మహేశ్ బాబుకి కూడా మహర్షి లాంటి మూవీ ఆ డేట్‌కే రిలీజ్అయ్యింది.
సరే.. ఈ రెండు కంటెంట్ వీక్ కాబట్టి కాసుల వర్షం కురిపించలేదు. కల్కి 2898ఏడీ మూవీ కంటెంట్ బాగుంటుందనే నమ్మకం వల్లే మే 9కి రిలీజ్ ఎనౌన్స్ చేశారంటున్నారు. ఏదేమైనా అటు మారుతి మూవీ విషయంలో రాజా సాబ్ టైటిల్, ఇక్కడ కల్కి రిలీజ్ డేట్ రెండూ కూడా ప్రభాస్ మొహమాటంతోనో, ప్రెజర్‌లోనే ఓకే చేయాల్సి వచ్చిందే తప్ప తనకి ఇష్టం లేదని ప్రచారం జరుగుతోంది.