Kalki : బుజ్జి, భైరవ టీజర్ అదిరింది
ప్రపంచం ఎంతో ఆసక్తిగా, మరెంతో ఎక్సైటింగ్‌గా ఎదురుచూస్తున్న ‘కల్కి 2898 ఎడి’కి సంబంధించిన భారీ ఈవెంట్‌తో బుజ్జిని పరిచయం చేసారు ప్రభాస్.

Kalki 2898 AD Bujji, Bhairava teaser is out
ప్రపంచం ఎంతో ఆసక్తిగా, మరెంతో ఎక్సైటింగ్‌గా ఎదురుచూస్తున్న ‘కల్కి 2898 ఎడి’కి సంబంధించిన భారీ ఈవెంట్‌తో బుజ్జిని పరిచయం చేసారు ప్రభాస్. అంతేకాదు, ఈ సినిమా టీజర్‌ని కూడా విడుదల చేసి సినిమా ఎలా ఉండబోతోందనే దానిపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ సినిమా పలు భాషల్లో విడుదలవుతున్న విషయం తెలిసిందే. అందుకే టీజర్ ఒకే భాషకు చెందినట్టు కాకుండా అందులోని డైలాగ్స్‌ను తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో వచ్చేలా ప్లాన్ చేశారు.
‘ఈ మిషన్ కష్టమే కాదు, అసాధ్యం కూడా’ అనే వాయిస్‌తో టీజర్ స్టార్ట్ అవుతుంది. ఒక మిషన్‌ని పూర్తి చేసేందుకు బుజ్జితో బయల్దేరిన భైరవకు ఆటంకాలు ఎదురు కావడం, దానికి బుజ్జి కూడా సహకరించకపోవడం వంటి సీన్స్ మనకు కనిపిస్తాయి. ‘నన్ను ఇందులో ఇన్‌వాల్వ్ చెయ్యకు’ అంటుంది బుజ్జి. ‘ఒక్కరోజు.. ఈరోజు.. జస్ట్ బి పాజిటివ్’ అంటాడు భైరవ. దానికి బుజ్జి ‘పద తిరిగి వెళ్దాం’ అంటుంది. దానికి భైరవ ‘ఇంక తిరిగి వెళ్లేదే లేదు’ అంటూ యుద్ధాన్ని కొనసాగిస్తాడు.
ఒక తెలుగు సినిమాలా కాకుండా హాలీవుడ్ స్టైల్‌లో, ఆ రేంజ్‌లో వున్న విజువల్స్ ఆడియన్స్‌ని థ్రిల్ చేస్తాయనడంలో ఎలాంటి సందేహంలేదు. ఇప్పటివరకు ఇండియాలో ఈ తరహా సినిమా రూపొందలేదు అనేది టీజర్‌లోనే అర్థమైంది. థియేటర్‌లో రిలీజ్ అయిన తర్వాత ‘కల్కి’ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.