Kalki 2898 AD: కల్కి కోసం క్యూలో బడా స్టార్స్.. మొత్తం ఎంత మందంటే..?

కల్కి సినిమాలో బడా స్టార్స్ డజన్ మంది మించిపోవటమే ఇండస్ట్రీ జనం కూడా షాక్ అవటానికి కారణం. ఇప్పుడీ ప్రచారం జరగడానికి మరో కారణం మలయాళం హీరో దుల్కర్ సల్మాన్ కూడా కల్కీ 2898 ఏడీలో భాగం కావటమే. అంతేనా సలార్‌లో ఆల్రెడీ ప్రభాస్‌కి విలన్‌గా నటించిన పృధ్వీరాజ్ కూడా కల్కీ 2898లో నటిస్తున్నాడట.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 18, 2023 | 06:01 PMLast Updated on: Aug 18, 2023 | 6:01 PM

Kalki 2898 Ad Have More Star Cast Than Any Other Movie Before

Kalki 2898 AD: కల్కి మూవీలో ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే హీరోయిన్‌గా కనిపించబోతోంది. అమితాబ్ స్పెషల్ రోల్ వేస్తున్నాడు. ఇలాంటి ఈ ప్రాజెక్ట్‌లో హీరోల మీద హీరోలు వచ్చిన జాయిన్ అవుతుంటే, ఇది ప్రభాస్ మూవీనా లేదంటే చాలా మంది హీరోల సినిమాలో రెబల్ స్టార్ గెస్ట్ రోల్ వేస్తున్నాడా అనే డౌట్లు పెరుగుతున్నాయి. అంత విచిత్రంగా ఇందులో స్టార్‌కాస్టింగ్ ఉంది. సినిమాలో బడా స్టార్స్ డజన్ మంది మించిపోవటమే ఇండస్ట్రీ జనం కూడా షాక్ అవటానికి కారణం.

ఇప్పుడీ ప్రచారం జరగడానికి మరో కారణం మలయాళం హీరో దుల్కర్ సల్మాన్ కూడా కల్కీ 2898 ఏడీలో భాగం కావటమే. అంతేనా సలార్‌లో ఆల్రెడీ ప్రభాస్‌కి విలన్‌గా నటించిన పృధ్వీరాజ్ కూడా కల్కీ 2898లో నటిస్తున్నాడట. అసలు ఎంతమంది ఇందులో స్టార్స్ నటిస్తున్నారు అన్నది లెక్కేస్తే 12కి మించిపోతోంది. హీరోగా ప్రభాస్, హీరోయిన్‌గా దీపికా పదుకొనే, సపోర్టింగ్ రోల్‌లో దిశా పటానీ, ఇక గురువు పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపించబోతున్నారు. ఆల్రెడీ లోకనాయకుడు కమల్ హాసన్ మొన్నే షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. ఇక దుల్కర్ సల్మాన్, ఫ్రుథ్వీ రాజ్‌తో కలిపితే 7 గురు అయ్యారు. విచిత్రం ఏంటంటే ఇందులో నాని, సూర్య కూడా గెస్ట్ రోల్స్ వేస్తున్నారట. హిందీ నుంచి నానాపటేకర్‌ని ఓ పాత్రకోసం ఒప్పించారట.

హేమామాలిని, రేఖ, రేవతి కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా మారబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ఈ సంఖ్య 12 మందికి చేరింది. ఐతే పార్ట్-2 కూడా ఉండటంతో దానికోసం ఇలా వీళ్లని పార్ట్ వన్‌లో కొన్న సీన్స్‌లో చూపిస్తారట. సో 90 శాతం షూటింగ్ అయ్యాక కూడా 8 మంది కొత్త స్టార్లని సినిమాలోకి తీసుకోవటానికి రీజన్.. సీక్వెల్ కోసం అవసరమైన పాత్రలని ఎంచుకోవటమే అని తెలుస్తోంది.