Prabhas, Pawan : ప్రభాస్ కోసం సీఎం, డిప్యూటీ సీఎం
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ 'కల్కి 2898 AD' .

'Kalki 2898 AD' is a sci-fi film directed by Nag Ashwin starring Pan India star Prabhas.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘కల్కి 2898 AD’ . వైజయంతి మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ‘కల్కి’పై అంచనాలు పెరిగిపోతూ ఉన్నాయి.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ ఆసక్తికరంగా మారింది.’కల్కి’ చిత్రంలో ప్రభాస్ ఉపయోగించిన వెహికిల్ బుజ్జి ని పరిచయం చేయడం కోసం.. ఇటీవల హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్ ను నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఈవెంట్ ను తలదన్నేలా అత్యంత వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారట.
అమరావతిలో నిర్వహించే ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. జూన్ 23 లేదా 25న కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందని సమాచారం. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ‘కల్కి’ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పటాని ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.