PUSHPA 2: అల్లు అర్జున్ రిలీజ్ డేట్‌పై ప్రభాస్ కన్ను.. కానీ..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప రాజ్‌గా రెండోసారి దండెత్తేందుకు ఆగస్ట్ 15న ముహుర్తం చూసుకున్నాడు. ఈలోపు మే 9న కల్కితో రెబల్ స్టార్ ప్రభాస్ బాక్సాఫీస్ మీద దండెత్తబోతున్నాడు. మే 9న సినిమా రిలీజ్ చేయలేకపోతే, పుష్ప 2 రిలీజ్ అయ్యే ఆగస్ట్ 15ని బ్యాకప్ ప్లాన్ చేసుకుంటున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 18, 2024 | 06:46 PMLast Updated on: Mar 18, 2024 | 6:46 PM

Kalki 2898 Ad Movie Release On If Pushpa 2 Postponed

PUSHPA 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప రాజ్‌గా రెండోసారి దండెత్తేందుకు ఆగస్ట్ 15న ముహుర్తం చూసుకున్నాడు. ఈలోపు మే 9న కల్కితో రెబల్ స్టార్ ప్రభాస్ బాక్సాఫీస్ మీద దండెత్తబోతున్నాడు. ఐతే కథలో చిన్న ట్విస్ట్ ఏంటంటే, కల్కి సినిమా రిలీజ్ వాయిదా పడితే.. ప్రభాస్ మూవీ విడుదలవుతుంది. నిజంగానే కల్కి మూవీ టీం ఇటలీ సాంగ్ షూట్ తర్వాత ప్యాచ్ వర్క్ పూర్తి చేసి, ఇక పోస్ట్ ప్రొడక్షన్ వేగం పెంచాలని ఇలా ప్లాన్ చేసుకుంది.

MEGASTAR CHIRANJEEVI: మెగాస్టార్ పదో తరగతి సర్టిఫికెట్ చూశారా..!

గ్రాఫిక్స్ క్వాలిటీ బాగున్నా, 70 పర్సెంటేజే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయ్యిందట. కారణం 30 పర్సెంట్ గ్రాఫిక్స్ వర్క్‌కి ఇంకా టైం పడేలా ఉందట. అంత అనుకున్నట్టే జరిగితే మే 9న కల్కి సినిమా రిలీజ్ అవ్వొచ్చు. అందుకు 60 శాతమే ఛాన్స్ ఉందట. అలానే డైరెక్టర్ నాగ్ అశ్విన్ అండ్ టీం కూడా మే 9 న ఎట్టిపరిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేయాలని తొందరపడటం లేదు. క్వాలిటీ ముఖ్యం అనుకుంటున్నారు. ముందు అది బాగుంటే, రిలీజ్ డేట్ వాయిదా పడ్డా పర్లేదనేది ఫిల్మ్ టీం అభిప్రాయంలా ఉంది.

మే 9న సినిమా రిలీజ్ చేయలేకపోతే, పుష్ప 2 రిలీజ్ అయ్యే ఆగస్ట్ 15ని బ్యాకప్ ప్లాన్ చేసుకుంటున్నారు. అంటే పుష్ప 2తో పోటీ పడటం లేదు. కానీ, పుష్ప 2 వాయిదా పడే ఛాన్స్ ఉంది. అదే జరిగితే ఆగస్ట్ 15కి కల్కి వస్తుందట. అలా కాకుండా పుష్ప 2 విడుదల వాయిదా పడకపోతే దసరాకే రిలీజ్ ప్లాన్ చేయాలనేది ఫిల్మ్ టీం నిర్ణయం అని తెలుస్తోంది.