Kalki 2898 AD: అస్సలు ఊహించలేదుగా.. ఓటిటిలోకి కల్కి

దర్శకుడు నాగ్‌ అశ్విన్‌.. ఈ సినిమా థియేటర్లో రిలీజ్‌కి ముందే అసలు కథ చెప్పబోతున్నాడట. ఈ మేరకు ఒక యానిమేషన్‌ వీడియో రూపొందించే ప్లాన్‌లో ఉన్నాడట. ‘కల్కి’ కథ ఆడియెన్స్‌కు ఈజీగా అర్థం కావడానికి ఒక యానిమేటేడ్ వెర్షన్ రెడీ చేస్తున్నాడట.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 7, 2024 | 10:38 AMLast Updated on: Apr 07, 2024 | 10:38 AM

Kalki 2898 Ad Prelude To Debut On This Ott Platform As Animation Form

Kalki 2898 AD: కల్కి సినిమా ఎప్పుడు రిలీజ్‌ కాబోతుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌లో ఉంది. సీజీ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్‌ కంప్లీట్ కాకపోవడం ఒకటైతే.. ఎన్నికల నేపథ్యంలో మే 9 నుంచి కల్కి సినిమాని వాయిదా వేయబోతున్నారు. మే 30న రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్ ఉంది. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుందని అంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

RAHUL GANDHI: మహిళలకు ఏడాదికి లక్ష.. మేడిన్ తెలంగాణయే లక్ష్యం: రాహుల్ గాంధీ

దర్శకుడు నాగ్‌ అశ్విన్‌.. ఈ సినిమా థియేటర్లో రిలీజ్‌కి ముందే అసలు కథ చెప్పబోతున్నాడట. ఈ మేరకు ఒక యానిమేషన్‌ వీడియో రూపొందించే ప్లాన్‌లో ఉన్నాడట. ‘కల్కి’ కథ ఆడియెన్స్‌కు ఈజీగా అర్థం కావడానికి ఒక యానిమేటేడ్ వెర్షన్ రెడీ చేస్తున్నాడట. అసలు కల్కి 2898 AD అంటే ఏంటి ఎలా ఉండబోతుంది సినిమాలో ఉన్నా క్యారెక్టర్స్‌, కల్కి వరల్డ్ ఈజీగా కనెక్ట్ అయ్యేలా ఈ యానిమేటేడ్ వీడియోని అందుబాటులోకి తీసుకురానున్నారట. అంటే.. కల్కి పాత్రలు, కల్కి ప్రపంచంపై ముందే జనాలకు ఓ అవగాహన వచ్చేలా ప్లాన్ చేస్తున్నారన్నమాట. ఈ వీడియోని ఓటిటిలో విడుదల చేయాలనుకుంటున్నారట. ఇప్పటికే ఈ దిశగా ప్రముఖ ఓటిటి సంస్థ నెట్‌‌ఫ్లిక్స్‌తో డీల్ జరిగిందని సమాచారం.

ఇలా చేయడం వల్ల బిజినెస్‌ కూడా భారీగా జరుగుతుందనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. మామూలుగా అయితే.. సినిమా రిలీజ్ అయి, భారీ విజయాన్ని అదుకుంటే ఇలాంటివి చేస్తుంటారు. కానీ కల్కితో కొత్త ప్రయత్నం చేస్తున్నారనే చెప్పాలి. మరి ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.