Kalki 2898 AD: చిరు డేట్‌ను పట్టారు.. ఆ సెంటిమెంట్ డేట్‌కే ప్రభాస్ ‘కల్కి’
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'కల్కి 2898 AD'. వైజయంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంది.

Kalki 2898 AD: ‘సలార్’తో ప్రేక్షకులను పలకరించాడు రెబల్ స్టార్ ప్రభాస్. డిసెంబర్ 22న విడుదలైన ఈ యాక్షన్ ఫిల్మ్ అదిరిపోయే వసూళ్లతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అభిమానులు ఈ ఆనందంలో ఉండగానే నాలుగు నెలలు తిరగకుండానే, ప్రభాస్ మరో సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘కల్కి 2898 AD’. వైజయంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.
Pushpa 2 song : పుష్ప 2 సాంగ్ లో ఆమె కాదు.. బడా హీరోయినే!
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంది. ప్రభాస్ కెరీర్‌లో ‘బాహుబలి’ ఫ్రాంచైజ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టించగల సత్తా ఉన్న సినిమా ‘కల్కి’ అని ప్రభాస్ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ని మేకర్స్ లాక్ చేసినట్లు తెలుస్తోంది.’కల్కి 2898 AD’ సినిమాను 2024, మే 9న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం. మరో రెండు, మూడు రోజుల్లో రిలీజ్ డేట్‌ని అఫీషియల్‌గా ప్రకటించనున్నారట. మే 9.. అనేది వైజయంతీ సంస్థకి సెంటిమెంట్ డేట్.
ఆ సంస్థ నుంచి వచ్చిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ 1990 మే 9న విడుదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలవగా, 2018 మే 9న విడుదలైన ‘మహానటి’ కూడా సంచలన విజయం సాధించింది. మరి అలాంటి బ్లాక్ బస్టర్ డేట్‌కి వస్తున్న ‘కల్కి’ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.