PRABHAS: ప్రభాస్ లేకుండానే కల్కి షూటింగ్.. కారణం ఇదే..!

ఆమధ్య అమెరికా వెళ్లి ఫిజియో థెరఫీ చేయించినా లాభం లేకుండా పోవడంతో.. మోకాలి సర్జరీ కోసం యూరప్‌ వెళ్లాడు. ఈసారి మాత్రం గాయం తగ్గేవరకు కెమెరా ముందుకు వెళ్లొద్దని డిసైడ్‌ అయ్యాడు ప్రభాస్‌. దీంతో ప్రభాస్‌ లేకపోయినా కల్కి షూటింగ్‌ త్వరలో మొదలవుతుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 18, 2023 | 08:56 PMLast Updated on: Sep 18, 2023 | 8:56 PM

Kalki 2898 Ad Shooting Is Going On Despite Without Prabhas

PRABHAS: మోకాలి ఆపరేషన్‌ చేయించుకోవడానికి ప్రభాస్‌ లండన్‌ వెళ్లాడు. ఇప్పట్లో షూటింగ్‌లో పాల్గొనే ఛాన్స్‌ లేదు. మూడు నెలలపాటు రెస్ట్ అవసరం. అయితే.. డార్లింగ్‌ సినిమాల షూటింగ్‌ మాత్రం ఆగడం లేదు. గతంలో ఆపరేషన్‌ చేయించుకుని.. రెస్ట్ తీసుకోకుండా షూటింగ్‌లో పాల్గొనడంతో.. కాలు నొప్పి తిరగబెట్టింది. ఆమధ్య అమెరికా వెళ్లి ఫిజియో థెరఫీ చేయించినా లాభం లేకుండా పోవడంతో.. మోకాలి సర్జరీ కోసం యూరప్‌ వెళ్లాడు. ఈసారి మాత్రం గాయం తగ్గేవరకు కెమెరా ముందుకు వెళ్లొద్దని డిసైడ్‌ అయ్యాడు ప్రభాస్‌.

దీంతో ప్రభాస్‌ లేకపోయినా కల్కి షూటింగ్‌ త్వరలో మొదలవుతుంది. ఇందులో విలన్‌గా నటిస్తున్న కమల్‌పై షూటింగ్‌ ఇంతవరకు తీయలేదు. అక్టోబర్‌, నవంబర్‌లో కమల్‌ పార్ట్‌ను పూర్తి చేస్తారట. ప్రభాస్‌ వచ్చిన తర్వాత హీరో బ్యాలెన్స్‌ వర్క్‌ పూర్తి చేస్తారు. ఈలెక్కన కల్కి 2024 మొదట్లో వస్తుందని ప్రకటించినా గ్యారెంటీ లేదు.
ప్రభాస్‌ లేని సీన్స్‌ తీసే పనిలో మేకర్స్‌ వున్నారు. ప్రభాస్‌, మారుతి మూవీ హారర్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్నా ఇంతవరకు ప్రకటించలేదు. ఏడాది నుంచి అప్పుడప్పుడు ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు ప్రభాస్‌. హీరో లేకపోయినా.. మాళవిక మోహనన్‌పై యాక్షన్ సీన్స్‌ తీస్తున్నాడు దర్శకుడు.