KALKI 2898 AD: ప్రభాస్‌తో కలిసి సెట్‌లో కమల్, అమితాబ్ సందడి
చివరి పాటని కూడా ఈనెల్లోనే పూర్తి చేసి కల్కి షూటింగ్‌కి గుమ్మడి కాయకొట్టబోతున్నారు. ఇక ఈ పాటలోనే ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ డాన్స్ చేయబోతున్నారట. ఇది మాంటేజ్ సాంగ్ కాదు. రొంమాంటిక్ సాంగ్ కాదు. ఇదోరకంగా ప్రమోషనల్ సాంగ్ అని తెలుస్తోంది.

Kalki 2898 AD is correct on that date..
KALKI 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి పెండింగ్ షూటింగ్ ఈ నెలలో పూర్తి కానుంది. ఈ వారమే పెండింగ్ షూటింగ్ తాలూకు చివరి షెడ్యూల్‌ని ప్లాన్ చేసింది ఫిల్మ్ టీం. ఆ సందడే ఇప్పడు మొదలైంది. ఇక ప్యాచ్ వర్క్‌తో సహా అన్ని పెండింగ్ సీన్లు ఈ నెల్లోనే పూర్తిచేయబోతోంది ఫిల్మ్ టీం. అంతేకాదు చివరి పాటని కూడా ఈనెల్లోనే పూర్తి చేసి కల్కి షూటింగ్‌కి గుమ్మడి కాయకొట్టబోతున్నారు. ఇక ఈ పాటలోనే ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ డాన్స్ చేయబోతున్నారట.
Allu Arjun: అరుదైన గౌరవం.. బెర్లిన్‌కు అల్లు అర్జున్.. ఎందుకో తెలుసా..?
ఇది మాంటేజ్ సాంగ్ కాదు. రొమాంటిక్ సాంగ్ కాదు. ఇదోరకంగా ప్రమోషనల్ సాంగ్ అని తెలుస్తోంది. కల్కిలో కమల్ విలన్‌గా, అమితాబ్ గురువుగా కనిపించబోతున్నారు. ఇక దీపిక, దిశా పటాని ఇద్దరూ రెండు వేరు వేరు కాలాల్లో హీరో ప్రేయసిగా కనిపిస్తుంటే, భవిష్యత్ తరానికి చెందిన పాత్రలో రౌడీ స్టార్, సెవెంటీన్ సెంచరీకి చెందిన వ్యక్తిగా దుల్కర్ సల్మాన్ స్పెషల్ రోల్ వేయబోతున్నారు. అయితే ఇక్కడ హాట్ టాపిక్ ఏంటంటే, పాన్ వరల్డ్ మూవీగా రానున్న ఈ సినిమాని ప్రమోట్ చేసేందుకు స్పెషల్ సాంగ్‌ని తెరకెక్కించబోతోందట ఫిల్మ్ టీం.
ఇది ర్యాప్ హిపాప్ జోనర్‌లో ప్లాన్ చేశారు. ఇక హీరోతో పాటు స్టార్స్ అంతా బ్రేక్ డాన్స్ చేసే కాన్సెప్ట్‌ని ఈ పాటలో ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. అచ్చంగా మగధీరలో చివరి సాంగ్, త్రిబుల్ ఆర్‌లో చివరి సాంగ్ లాంటి ప్రమోషనల్ సాంగ్ కోసం కల్కి టీం ఇలా వినూత్నంగా ఏదో ప్రయత్నిస్తోంది.