Kalki : 700 కోట్ల క్లబ్‌లో ‘కల్కి’
కల్కి 2898 AD స్పీడ్ కి ఇప్పట్లో బ్రేకులు పడేలా లేవు. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. పలు భారీ సినిమాల లైఫ్ టైం కలెక్షన్స్ ని కేవలం నాలుగైదు రోజుల్లోనే దాటేసింది.
కల్కి 2898 AD స్పీడ్ కి ఇప్పట్లో బ్రేకులు పడేలా లేవు. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. పలు భారీ సినిమాల లైఫ్ టైం కలెక్షన్స్ ని కేవలం నాలుగైదు రోజుల్లోనే దాటేసింది. కల్కి సినిమాకు హిట్ టాక్ రావడంతో.. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతోంది. లాంగ్ వీకెండ్ టార్గెట్ చేస్తూ.. గురువారం రోజు జూన్ 27న కల్కి భారీ ఎత్తున థియేటర్లోకి వచ్చింది. ఫస్ట్ డే 191.5 కోట్ల గ్రాస్ రాబట్టిన కల్కి.. ఫస్డ్ వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి 555 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక మండే వర్కింగ్ డే అవడంతో వసూళ్లు కాస్త తగ్గాయి. అయినా కూడా భారీ వసూళ్లనే నమోదు చేసింది.
ఐదో రోజు 70 కోట్లు, ఆరో రోజు 55 కోట్లు రాబట్టి.. మొత్తంగా ఆరు రోజుల్లో ప్రపంచం వ్యాప్తంగా 680 కోట్లు కొల్లగొట్టింది. ఈ లెక్కన.. వర్కింగ్ డేస్‌లలో కూడా మినిమం రోజుకి యాభై కోట్లకు పైగా వసూళ్లను రాబడుతోంది కల్కి. రిలీజ్ అయిన రోజు నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు వంద కోట్లకు పైగా గ్రాస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఏడు రోజుల్లో 700 కోట్ల క్లబ్‌లో జాయిన్ కానుంది కల్కి. బాహుబలి 2, సలార్ తర్వాత ప్రభాస్ ఖాతాలో 700 కోట్ల సినిమాగా కల్కి నిలిచింది. 700 కోట్ల క్లబ్‌లో మొత్తం మూడు సినిమాలతో రికార్డ్ క్రియేట్ చేశాడు ప్రభాస్.
ఇక.. కల్కి సినిమా టికెట్ రేట్లు తగ్గుతున్నాయి కాబట్టి.. మళ్ళీ ఈ వారాంతంలో వసూళ్లు పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఓవర్సీస్‌లో ఏ మాత్రం తగ్గకుండా భారీ వసూళు రాబడుతోది. నార్త్ అమెరికాలో 13 మిలియన్లకు చేరువలో ఉంది. బాలీవుడ్‌లో మొత్తం ఆరు రోజుల్లో 142 కోట్లు రాబట్టిన కల్కి.. ఏడో రోజుతో 150 కోట్ల మార్క్ టచ్ చేయనుంది. మైథలాజికల్ సైన్స్ ఫిక్షనల్ మూవీగా నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ 600 కోట్ల భారీ బడ్జెట్‌తో కల్కిని నిర్మించారు. దీపిక పదుకొనే, దిశా పటానీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.