kalki first day collections : ‘కల్కి‘ ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.191.5 కోట్లు
కల్కి 2898 ఏడీ.. ఇండియన్ సినిమా నుంచి వరల్డ్ వైడ్ గా ఉన్న మూవీ లవర్స్ కు అందిన ఐ ఫీస్ట్ ఈ సినిమా. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసిన ఈ సినిమా పేరే వినిపిస్తోంది.

Kalki 2898 AD.. This movie is an eye feast for movie lovers worldwide from Indian cinema.
కల్కి 2898 ఏడీ.. ఇండియన్ సినిమా నుంచి వరల్డ్ వైడ్ గా ఉన్న మూవీ లవర్స్ కు అందిన ఐ ఫీస్ట్ ఈ సినిమా. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసిన ఈ సినిమా పేరే వినిపిస్తోంది. ఇక వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర ఈ సనిమా దుమ్ములేపుతోంది. జూన్ 27న విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. తొలి రోజు తొలి షోకే పాజిటీవ్ టాక్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకలు ఎగబడుతున్నారు. దీంతో తొలి రోజే భారీగా కలెక్షన్లను కొల్లగొట్టింది.
మైథాలజీని సైంటిఫిక్ వేలో చూపించాలి అనే నాగ్ అశ్విన్ థాట్ కి మూవీ లవర్స్ ఫిదా అయిపోతున్నారు. హాలీవుడ్ కి ఏ మాత్రం తక్కువ లేదు అన్నట్లు కల్కి మూవీని తెరకెక్కించాడు. రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ సినిమా వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతోంది. కలెక్షన్ల సునామి సృష్టింస్తోంది రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 AD‘ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా ‘కల్కి‘ చిత్రం రూ.191.5 కోట్లు గ్రాస్ ను వసూలు చేసింది. ఈ కలెక్షన్లను నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు.. ‘కల్కి‘ చిత్రం కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో భారీ స్థాయిలో విడుదలైంది. ఉత్తరాదిన సైతం ‘కల్కి‘ బాక్సాఫీస్ ను ఊపేస్తోంది. ఓవర్సీస్ లెక్కలు గురించి చెప్పక్కర్లేదు. అక్కడ 5 మిలియన్ల డాలర్లను దాటేశాయి.
మొత్తంమీద.. గత జూన్ లో ‘ఆదిపురుష్‘ నుంచి ఈ జూన్ లో ‘కల్కి‘ వరకూ ఏడాది కాలంలోనే మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు ప్రభాస్. ‘ఆదిపురుష్‘తో బాక్సాఫీస్ వద్ద తొలిరోజు రూ.140 కోట్లు కలెక్షన్లను కొల్లగొట్టిన రెబెల్ స్టార్.. డిసెంబర్ లో వచ్చిన ‘సలార్‘తో ఫస్ట్ డే రూ.178 కోట్లు వసూళ్లు సాధించాడు. ఇప్పుడు ఆ రెండు చిత్రాలకు మిన్నగా ‘కల్కి‘తో ఏకంగా ఫస్ట్ డే రూ.191.5 కోట్లు సాధించడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. దీంతో ప్రభాస్ అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ అంటే ఒక్కే ఒక్కడు. అదే రెబల్ స్టార్ ప్రభాస్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.