KALKI 2898 AD: ప్రభాస్ ఫ్యాన్స్ మైండ్ బ్లాంక్ చేసే పనిలో నాగ్ అశ్విన్ !
కల్కి మూవీ రిలీజ్ మే 9 నుంచి వాయిదా పడే అవకాశం ఉండొచ్చు, లేకపోవచ్చు. అంతా గ్రాఫిక్స్ వర్క్‌ని ఒకసారి ఈనెల 25కి చూశాకే డైరెక్టర్‌కి ఓ క్లారిటీ వస్తుందట. మార్చ్ 25కి గ్రాఫిక్స్ సీన్స్ సంబందించిన ఫైనల్ వర్క్ ప్రివ్యూ ఉందట.

Kalki 2898 AD is correct on that date..
KALKI 2898 AD: కల్కి మూవీ టీం ప్రస్తుతం ఇటలీలో ఓ మాంటేజ్ సాంగ్‌ని షూట్ చేస్తోంది. అక్కడ టీం ఏయిర్ పోర్ట్ లో చేసిన సందడి తాలూకు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక దిశా పటానీ కూడా తన పాత్ర తాలూకు షూటింగ్ పూర్తవటంతో ఇండియాకు తిరిగొచ్చిసినట్టు అప్‌డేట్ ఇచ్చింది. ఇక ఇండియాలో ఒక షెడ్యూల్ పూర్తి చేస్తే కల్కి షూటింగ్‌కి గుమ్మడి కాయ కొట్టేయటమే. అంటే.. మార్చ్ 20లోగా కల్కి షూటింగ్ పూర్తవుతుంది.
Rakhi Sawant: నా దగ్గరకు పంపితే.. అనంత్ అంబానీ బరువుపై నటి వల్గర్ కామెంట్స్
ఆ తర్వాత మే9 వరకు ఫిల్మ్ టీం మొత్తం ప్రమోషన్‌తోనే బిజీ అవుతుందా అంటే, ఆ ఒక్కటి అడక్కు అంటోంది సినిమా టీం. ఎందుకు..? షూటింగ్ పూర్తౌతోందంటే, ఇక రిలీజ్ డేట్ మారదని క్లారిటీ ఇస్తూ ఉంటే, ఇక సినిమా ప్రమోషన్ ఎందుకు షురూ చేయరనే డౌట్ రాకమానదు. అసలు కారణం ఏంటంటే కల్కి మూవీ రిలీజ్ మే 9 నుంచి వాయిదా పడే అవకాశం ఉండొచ్చు, లేకపోవచ్చు. అంతా గ్రాఫిక్స్ వర్క్‌ని ఒకసారి ఈనెల 25కి చూశాకే డైరెక్టర్‌కి ఓ క్లారిటీ వస్తుందట. మార్చ్ 25కి గ్రాఫిక్స్ సీన్స్ సంబందించిన ఫైనల్ వర్క్ ప్రివ్యూ ఉందట.
గ్రాఫిక్స్ బాగుంటే మే 9కి కల్కి రిలీజ్ ఖాయం. అందులో డౌట్ లేదు. ఒకవేళ అనుకున్నట్టుగా గ్రాఫిక్స్ వర్క్ బాలేదనిపిస్తే, మళ్లీ గ్రాఫిక్స్ రిపేర్లు జరగొచ్చు. అందుకే ఏప్రిల్ నెల సరిపోతుందా? సరిపోతే పర్లేదు. లేదంటే వాయిదా తప్ప మరో గత్యంతరంలేదు. అందుకే రిలీజ్ డేట్ మారదని పైకి ఎంత చెప్పినా, ఎన్ని అప్‌డేట్స్ ఇచ్చానా, రిలీజ్ డేట్ మారుతుందా లేదా అనేది ఈనెల 25 న గ్రాఫిక్స్ వర్క్ తాలూకు ఫైనల్ ఔట్‌పుట్ ప్రివ్యూ చూస్తేనే క్లారిటీ వస్తుంది.