300 రోజులు ట్రెండింగ్ లో… దీనమ్మ జపాన్ రెబల్ ఫ్యాన్స్.

రెబల్ స్టార్ ప్రభాస్ హిట్ మూవీ కల్కీ రిలీజై 6 సిక్స్ మంథ్స్ అవుతోంది... ఓటీటీలో వచ్చే దాదాపు 4 నెలలు గడిచాయి. కాని ఇప్పటికీ ఈ మూవీ డిజిటల్ ప్లాట్ ఫాంలో ట్రెండింగ్ లోనే ఉంది. అలా ఏకంగా 100 రోజులుగా ఈ మూవీ అదే లెవల్లో ఓటీటీని శాసిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 19, 2024 | 01:58 PMLast Updated on: Dec 19, 2024 | 1:58 PM

Kalki Domination In Japan

రెబల్ స్టార్ ప్రభాస్ హిట్ మూవీ కల్కీ రిలీజై 6 సిక్స్ మంథ్స్ అవుతోంది… ఓటీటీలో వచ్చే దాదాపు 4 నెలలు గడిచాయి. కాని ఇప్పటికీ ఈ మూవీ డిజిటల్ ప్లాట్ ఫాంలో ట్రెండింగ్ లోనే ఉంది. అలా ఏకంగా 100 రోజులుగా ఈ మూవీ అదే లెవల్లో ఓటీటీని శాసిస్తోంది. ఇలాంటి టైంలో జపాన్ ని కుదిపేసేందుకు కల్కీ టీం స్పీడ్ పెంచింది.బాహుబలి నుంచే జపాన్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ వస్తోన్న ప్రభాస్, ఈ విషయంలో రజినీకాంత్ నే మించిపోయాడు. జపాన్ లో మరో ఇండియన్ హీరోకి ఫ్యాన్ బేస్ ఉందంటే అది రెబల్ స్టార్ కే అని బాహుబలి నుంచే కన్ఫామ్ అయ్యింది. సూపర్ స్టార్ ఇమేజ్ కంటే అక్కడ ప్రభాస్ మార్కెట్ కి మైలేజే ఎక్కువ. అదే విషయం కల్కీ రిలీజ్ తాలూకు హంగామాతో మరోసారి ప్రూవ్ అవుతోంది. కల్కీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ట్వీట్లు, తనకి వచ్చిన గ్రీటింగ్ కార్డులే జపాన్ లో ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో తెలిసేలా చేస్తోంది. ది రాజా సాబ్ టీజర్ వస్తున్న వేల ఈ వైబ్స్ ఫ్యాన్స్ కి డబుల్ కిక్ ఇచ్చేలా ఉన్నాయి.

రెబల్ స్టార్ కి ఫ్యాన్స్ కాదు డై హార్డ్ ఫ్యాన్స్ ఎక్కువ. అదెన్నో సార్లు ప్రూవ్ అయ్యింది. కాకపోతే ఇండియాలోనో లేదంటే విదేశాల్లో సెటిలైన ఇండియన్స్ లో తనకు ఫ్యాన్స్ ఉన్నారంటే ఏమో అనుకోవచ్చు.. కాని జపాన్ లో కూడా తనకి భారీ ఫ్యాన్ బేస్ ఉండటం మాత్రం నిజంగా కొత్తగా అనిపిస్తుంది. ఐతే ఈ ఫ్యాన్ బేస్ ఇప్పుడు మొదలైంది కాదు, తన బాహుబలి మూవీ నుంచే ఇది మొదలైంది. బాహుబలి 1 , బాహుబలి 2, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, ఇలా తన ప్రతీ పాన్ ఇండియా హిట్ మూవీ అక్కడ కూడా రిలీజ్ అయ్యింది

ఇప్పుడు కల్కీ వంతొచ్చింది. ఇక్కడ 1200 కోట్లు రాబట్టిన ఈ సినిమా జపాన్ లో ఇప్పుడు రిలీజ్ కాబోతోంది. యాంకిల్ కి దబ్బతగలటంతో ప్రభాస్ తన కల్కీ ప్రమోషన్ కి జపాన్ వెళ్లకున్నా, తన మీద అక్కడి జనం గ్రీటింగ్ కార్డ్స్ తో తెలిపారు.

కల్కీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కి జపనీస్ నుంచి కుప్పల కుప్పలుగా గ్రీటింగ్ కార్ట్స్ వచ్చాయి. ప్రభాస్ ని విష్ చేస్తూ, అక్కడ రిలీజ్ కాబోతున్న కల్కీ మూవీని ప్రస్తావిస్తూ గ్రీటింగ్ కార్డ్స్ పెట్టారట. వాటినే నేలమీ పరిచి సోషల్ మీడియాలో పెట్టాడు నాగ్ అశ్విన్… ఇదే ఇప్పుడు జపాన్ తోపాటు ఇండియాలో వైరలౌతోంది.

ఇలాంటి టైంలో కల్కీ తాలూకు కొత్త రికార్డొకటి రివీల్ అయ్యింది. ఓటీటీలో ఆగస్ట్ 22న స్ట్రీమింగ్ లోకి వచ్చిన కల్కీ మూవీ, ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంది. ఏ కొత్త మూవీ అయినా వారం,లేదంటే రెండు వారాలు, కాదంటే నెలవరకు ట్రెండింగ్ లో ఉందంటే ఏమో అనుకోవచ్చు. కాని ఏకంగా 100 రోజులుగా ఓటీటీలో ఈ మూవీ ట్రెండింగ్ లో ఉందంటే అది రికార్డే..

ఒకవైపు ఈనెల 25 న క్రిస్మస్ స్పెషల్ గా ది రాజా సాబ్ టీజర్ రాబోతోంది. మరో వైపు ఆ మూవీని కూడా విష్ చేస్తూ జపనీస్ గ్రీటింగ్ కార్డ్ పంపడంతో, ది రాజా సాబ్ టీం కొత్త నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అదేంటంటే, జపాన్ లో కల్కీ మూవీ ఎక్కడెక్కడ రిలీజ్ అవుతుందో, ఆ థియేటర్స్ లో ది రాజా సాబ్ టీజర్ ని కూడా లాంచ్ చేస్తారట… మొత్తంగా ఒకప్పుడు రజినీకాంత్ కి జపాన్ లోఫ్యాన్స్ ఉన్నారు. అమితాబ్ బచ్చన్ కి ఈజిప్ట్ లో అభిమానులున్నారంటే ఆశ్చర్యంగా చెప్పుకునేవాళ్లు..కాని రెబల్ స్టార్ కి జపాలో ఉన్న హార్డ్ కోర్ ఫ్యాన్స్ ని చూసి, ఇండియన్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.