పుష్ప 2 రిలీజైన వారంలోపే వసూల్ల వరద తగ్గిందన్నారు. కాని 1000 కోట్లు 1500 కోట్లు, 1700 కోట్లు ఇలా వరుసగా పోస్టర్లు వచ్చాయి. జరిగే వివాదాలు జరిగాయి. కట్ చేస్తే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు టైం వచ్చేసింది. విచిత్రం ఏంటంటే చాలా తక్కువ గ్యాప్ లో ఓటీటీ లో స్ట్రీమింగ్ కొచ్చిన వెంటనే టీవీల్లో కూడా టెలికాస్ట్ కాబోతోంది. అంతవరకు ఓకే కాని, ఇక్కడ కూడా పుష్పీ2 కి ఏదీ అంత ఈజీ కాదని అర్ధమౌతోంది. పోటీకి సీన్ లో కొస్తున్నాడు రెబల్ స్టార్. తన కల్కీ మూవీ టీవీ ఛానల్స్ మీద దాడి చేసేందుకు సిద్ధమైంది. సో టీవీల్లో, ఓటీటీల్లో వ్యూస్ ని ఎవరూ అంత ఈజీగా మ్యానిపులేట్ చేయలేరు కాబట్టి, ఏ సినిమా సత్తా ఏంటో ఇప్పుడు తేలబోతోంది. పుష్ప2 ఓటీటీలో ఎంతగా దుమ్ముదులుపుతుంది...? టీవీల్లో వచ్చాక కల్కీ రేంజ్ ని రీచ్ అవుతుందా లేదా? అనేది మరికొన్నిరోజుల్లో తేలబోతోంది. బాక్సాఫీస్ లెక్కల్లో ఎన్ని నిజాలో కూడా తేలేందుకు ఛాన్స్ ఉంది. పుష్పీ2 మూవీ థియేటర్స్ జర్నీ పూర్తైంది. ఇప్పుడుఓటీటీలో రిలీజ్ కాబోతోంది. జనవరి 26 కి ఈ సినిమా ఓటీటీలో టెలికాస్ట్ అయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ 250 కోట్లు పెట్టి నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ రైట్స్ తీసేసుకుంది. అంతవరకు ఓకే కాని, ఇప్పుడు కల్కీతోనే ఈ సినిమాకు కొండంత టెన్షన్ పెరిగింది ఎందుకంటే కల్కీ మూవీ ప్రతీ ఏరియాలో పుష్ప2 ని ఇబ్బంది పెడుతోంది. యూఎస్ లో బాహుబలి 2 తాలూకు 2 మిలియన్ డాలర్ల వసూళ్ల రికార్డుని పుష్ప2 బ్రేక్ చేస్తుందన్నారు. కాని కల్కీ తాలూకు 15 మిలియన్ల డాలర్ల రికార్డుని పుష్పీ2 టచ్ కూడా చేయలేకపోయింది. ఇప్పుడు ఓటీటీలో కొండంత రికార్డులని రెడీ చేసింది. వాటిని పుష్ప2 బ్రేక్ చేస్తుందా కనీసం టచ్ చేస్తుందా? ఇవి సోషల్ మీడియాలో అల్లు ఆర్మీకి రెబల్ ఫ్యాన్స్ నుంచి ఎదురౌతున్న ప్రశ్నలు.ఇదంతా ఎందుకంటే బాహుబలి తాలూకు 1850 కోట్ల రికార్డుని బ్రేక్ చేయబోతున్న పుష్ప2, ఆల్రెడీ 1800 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టిన పుష్ప2 అంటూ అల్లు ఆర్మీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారట కాని పుష్ప2 మూవీ రిలీజైన ఐదో రోజునుంచే తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు డ్రాప్ అయ్యాయన్నారు. కర్ణాటకా లో యావరేజ్, తమిళ నాడులో బిలో యావరేజ్ టాక్, మలయాళం మార్కెట్ లో డిజాస్టర్ అనితేల్చారు. హిందీ వర్షన్ లో తప్ప మరే వర్షన్ లో కూడా యూఎస్ లో వసూల్ల వర్షటం రాలేదు. నార్త్ ఇండియా లో తప్ప ఇంకెక్కడ పుష్ప2 దుమ్ముదులపినట్టులేదు అలాంటప్పుడు, పుష్ప 2 కంటే భారీగా హిట్టైన కల్కీకి 1200 కోట్లు, వసూళ్లు డ్రాపైన పుష్పకి 1800 కోట్ల వసూళ్లా అన్న డౌట్లు పెరిగాయి. ఈసినిమా స్టామినా ఏంటో ఓటీటీలో రిలీజ్ అయ్యాకే తెలుస్తుందంటున్నారు. ఆల్రెడీ కల్కీ ఓటీటీలో వ్యూవర్ షిప్ తో రికార్డులు క్రియేట్ చేసింది. ఆ రికార్డులని పుష్ప2 టచ్ చేస్తుందా? లేదా అనేదాన్ని బట్టీ ఈ వసూళ్ల లెక్కలెంత నిజమో తేలుతుందంటున్నారు. ఇది కాకుండా కల్కీ మూవీ జనవరి 12న టీవీల్లో టెలికాస్ట్ కాబోతోంది. అక్కడ కూడా భారీ రికార్డులు ఈ సినిమా క్రియేట్ చేస్తే, వన్ మంథ్ తర్వాత పుష్ప2 కూడా టీవీలో టెలికాస్టై ఆరేంజ్ రికార్డులు క్రియేట్ చేయాలి... ఇటు ఓటీటీ, అటు టెలివిజన్ లో పుష్ప2 ఏమాత్రం వెనకడుగు వేసినా, థియేట్రికల్ కలెక్షన్స్ రికార్డుల లెక్కలన్నీ అబద్దం అనుకునే ఛాన్స్ఉంది. [embed]https://www.youtube.com/watch?v=8cGLOHsPfxM[/embed]