Kalki : కల్కి’ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ
ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) మూవీ జూన్ 27 రిలీజ్‌కు రెడీ అవుతోంది. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను.. వైజయంతీ మూవీస్ బ్యానర్ (Vyjayanthi Movies Banner) పై సి అశ్వినిదత్ (Ashwinidat) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Kalki' is a leading company that owns the rights
ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) మూవీ జూన్ 27 రిలీజ్‌కు రెడీ అవుతోంది. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను.. వైజయంతీ మూవీస్ బ్యానర్ (Vyjayanthi Movies Banner) పై సి అశ్వినిదత్ (Ashwinidat) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, దిశా పటాని, కమల్ హాసన్ (Kamal Haasan) కీలక పాత్రలు చేస్తుండగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. మరోవైపు.. కల్కి (Kalki) సినిమా బిజినెస్ డీల్స్ క్లోజ్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్.
ఈ సినిమాకు రికార్డ్ రేంజ్ బిజినెస్ జరుగుతున్నట్టుగా ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే థియేట్రికల్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరుగుతున్నట్టుగా చెబుతున్నారు. గతంలో ఓవర్సీస్ రైట్స్ కోసం వంద కోట్లు కోట్ చేస్తున్నారని టాక్ వచ్చింది. అలాగే.. ఒక్క నైజాంలోనే 100 కోట్లకి పైగా ఆఫర్ వచ్చిందని అన్నారు. ఏపీలో కూడా 100 కోట్లకి పైగా డిమాండ్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కల్కికి ఏకంగా 200 కోట్లకి పైగా బిజినెస్ జరగనుందని అంటున్నారు. అయితే.. కల్కి తెలుగు రైట్స్ ఎవరి చేతికి వెళ్లనున్నాయి.. అనే ఇంకా తెలి విషయాల్లో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ లేటెస్ట్‌గా కల్కి కర్ణాటక డీల్ మాత్రం క్లోజ్ అయింది. గతంలో కర్ణాటక రైట్స్ కోసం పాతిక కోట్ల వరకు కోట్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే.. ఈ విషయంలో క్లారిటీ లేదు గానీ.. తాజాగా కల్కి కర్ణాటక రైట్స్‌ను ప్రముఖ బ్యానర్ ‘KVN ప్రొడక్షన్స్’ సొంతం చేసుకుంది. ఎంత కాదనుకున్న 20 కోట్లకు అటు ఇటుగా కర్ణాటక రైట్స్ అమ్ముడయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. అలాగే.. త్వరలోనే మిగతా ఏరియాల బిజినెస్ డీల్స్ కూడా క్లోజ్ కానున్నాయి.