Kalki – NTR : కల్కిలో యంగ్ టైగర్… ఫ్యాన్స్ కు పూనకాలే..
‘కల్కి 2898 AD’ (Kalki 2898AD) విడుదలకు ముందే మూవీ లవర్స్ కు మెంటల్ ఎక్కిస్తోంది. యంగ్ రెబల్ స్టార్ (Rebel Star) ప్రభాస్-నాగ్ అశ్విన్ (Prabhas-Nag Ashwin) దర్శకత్వంలో పాన్ ఇండియా ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం రోజు రోజుకు అంచనాలను పెంచేస్తోంది.

Kalki - NTR Young Tiger in Kalki... Poonakale for fans..
‘కల్కి 2898 AD’ (Kalki 2898AD) విడుదలకు ముందే మూవీ లవర్స్ కు మెంటల్ ఎక్కిస్తోంది. యంగ్ రెబల్ స్టార్ (Rebel Star) ప్రభాస్-నాగ్ అశ్విన్ (Prabhas-Nag Ashwin) దర్శకత్వంలో పాన్ ఇండియా ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం రోజు రోజుకు అంచనాలను పెంచేస్తోంది. ఇప్పటికే అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), కమల్ హాసన్(Kamal Haasan), దీపికా పదుకొణె లాంటి భారీ కాస్టింగ్ తో అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. తాజాగా ఈ మూవీ నుంచి వస్తున్న అప్డేట్స్ చూస్తుంటే ఒక్కొక్కరికి మతిపోతోంది. దీంతో నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఏదో పెద్ద ప్లానే వేశాడని నెటిజన్లు షాక్ అవుతున్నారు.
‘కల్కి’ (Kalki) నుంచి మరో క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటికే భారీ కాస్టింగ్ అందరి మతిపోగొడుతున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఇది చాలదు అన్నట్లుగా క్యామియో రోల్స్ కోసం ఎవ్వరూ ఊహించని హీరోలను దింపుతున్నాడు ఈ క్రియేటీవ్ డైరెక్టర్.ఇప్పటికే గెస్ట్ రోల్స్ కోసం దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ ను తీసుకున్న వార్తలు వైరల్ గా మారితే… రీసెంట్ గాన్యాచురల్ స్టార్ నాని సైతం కల్కిలో ఓ కీలక పాత్ర చేస్తున్నట్లు న్యూస్ తెగ చెక్కర్లు కొట్టింది. తాజాగానానితో పాటుగా మరో క్రేజీ హీరో ఈ మూవీలో అతిథి పాత్రలో కనిపించనున్నాడ వార్త చక్కర్లు కొడుతోంది.
కల్కిలో మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. క్లైమాక్స్ ముందు వచ్చే కీలక సన్నివేశాల్లో పరశురాముడి పాత్రలో జూ.ఎన్టీఆర్ కనిపిస్తారని తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై ఇటు నిర్మాణ సంస్థ గానీ, అటు డైరెక్టర్ నాగ్ అశ్విన్ గానీ ఎలాంటి ప్రకటనా చేయలేదు. దీంతో వీరి మౌనం వెనక అర్థం ఏంటో అర్దం కాక సినీ అభిమానులు అయోమయానికి గురౌతున్నారు. కాగా.. ఇదే న్యూస్ ఒకవేళ నిజమైతే.. థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం అంటున్నారు యంగ్ టైగర్ ఫ్యాన్స్. ఒకే ఫ్రేమ్ లో ఇటు ప్రభాస్ ను, అటు ఎన్టీఆర్ ను చూస్తే.. అరాచకాలే అంటున్నారు. ఇదిలా ఉండగా.. మే 9న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. మరీ కల్కిలోయంగ్ టైగర్ కనిపిస్తే బాక్సాఫీస్ ఊచకోత నెక్ట్స్ లెవల్ లో ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. మరీ ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే