Kalki 2898 Ad Release Date : కల్కి రిలీజ్ రూమర్లకు చెక్…
రెబల్ స్టార్ (Rebel Star) ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ సినిమా ‘కల్కీ 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమా విడుదల తేదీపై రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. తొలుత ఈ సినిమా వచ్చే మే 9న విడుదల అవుతుందని ప్రకటించారు. అయితే ఎన్నికల నేపథ్యంలో విడుదలను వాయిదా వేశారు. పలు కారణాల వల్ల దీని విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తోంది.

Kalki release rumors check...
రెబల్ స్టార్ (Rebel Star) ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ సినిమా ‘కల్కీ 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమా విడుదల తేదీపై రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. తొలుత ఈ సినిమా వచ్చే మే 9న విడుదల అవుతుందని ప్రకటించారు. అయితే ఎన్నికల నేపథ్యంలో విడుదలను వాయిదా వేశారు. పలు కారణాల వల్ల దీని విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తోంది. దీంతో ఈ విడుదల తేదీపై రకరకాల రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ రూమర్లన్నింటికీ మూవీ టీం చెక్ పెట్టనుంది.
ఈ విషయమై కల్కి మూవీ టీం గురువారం డిస్ట్రిబ్యూటర్లతో సమావేశం కానుంది. ఈ సమావేశం పూర్తయిన తర్వాత విడుద తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒక వేళ విడుదల తేదీ మరింత ఆలస్యం అయినా కూడా ఒకటి రెండు రోజుల్లో ఆ డేట్‌ని ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఈ సాయంత్రానికి ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
నాగ్ అశ్విన్ (Nag Ashwin) – ప్రభాస్ కాంబో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో నిర్మితమైన సంగతి అందరికీ తెలిసిందే. మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో అశ్విన్ ఈ సినిమాని తెరకెక్కించారు. రామాయణం, మహాభారతం లాంటి వాటిని ఆధారణంగా చేసుకుని వేల సంవత్సరాల క్రితం మొదలైన కథకు టైమ్ ట్రావెల్‌ని జోడించి ఆసక్తికరంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు వారు చెబుతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె, దిశా పటానీలు నాయికలుగా నటించారు. బిగ్‌బీ అమితాబచ్చన్, కమల్‌హాసన్ లాంటి సీనియర్ నటులు కూడా ఈ సినిమాలో నటించారు.