కల్కీ సీక్వెలే ఓ సునామీ… పార్ట్ 2 తో 2000 కోట్లు కన్ఫామ్…

రెబల్ స్టార్ ప్రభాస్ తో నాగ్ అశ్విన్ తీయబోయే కల్కీ 2 తాలూకు అప్ డేట్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఫస్ట్ పార్ట్ తో 1250 కోట్ల వసూళ్లు రాబట్టిన ప్రభాస్, సెకండ్ పార్ట్ తో రెండువేల కోట్లు ఈజీగా రాబట్టేస్తాడని కన్ఫామ్ అయ్యింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 20, 2025 | 06:31 PMLast Updated on: Mar 20, 2025 | 6:31 PM

Kalki Sequel Is A Tsunami 2000 Crores Confirmed With Part 2

రెబల్ స్టార్ ప్రభాస్ తో నాగ్ అశ్విన్ తీయబోయే కల్కీ 2 తాలూకు అప్ డేట్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఫస్ట్ పార్ట్ తో 1250 కోట్ల వసూళ్లు రాబట్టిన ప్రభాస్, సెకండ్ పార్ట్ తో రెండువేల కోట్లు ఈజీగా రాబట్టేస్తాడని కన్ఫామ్ అయ్యింది. దానికి కారణం కల్కీ 2 లో కథంతా భైరవ చుట్టూనే తిరగటం. ఈ విషయంలో క్లారిటీ ఇచ్చి, సడన్ గా సినిమా మీద అంచనాలు ఆకాశాన్నంటేలా చేస్తున్నాడు నాగ్ అశ్విన్. మేలో సెట్స్ పైకెళ్లే సినిమా, ఇప్పటికిప్పుడు వచ్చే ఛాన్స్ లేదు. వచ్చే ఏడాది తప్ప ముందే విడుదలకీ అవకాశమే లేదు. కాబట్టి ఏదో జనాల్లో హైప్ పెంచేందుకే నాగ్ అశ్విన్ ఇలాంటి స్టేట్ మెంట్ ఇచ్చాడనుకోలేం. అసలు కల్కీ లో పాత్రల పరిచయమే 80శాతం ఉంటే, అసలు కథ మొదలయ్యే లోపే సినిమా పూర్తైంది. కాబట్టే అసలు కథంతా పార్ట్ 2లో ఉందని అప్పడే తేలింది.. సో కల్కీ 2 మొత్తం సాలిడ్ ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్ ఉండటం కన్ఫామ్ అయ్యింది. ఆ మాత్రానికే 2 వేల కోట్ల వసూల్లొస్తాయా…? అక్కడే ఓ లాజిక్ మ్యాజిక్ చేస్తోంది. బాహుబలి 2, పుష్ప2 కి వర్కవుట్ అయ్యిందే కల్కీ 2 కి వర్కవుట్ అయ్యేలా ఉంది. అదేంటో చూసేయండి.

కల్కీ మూవీ 1200 కోట్లకు పైనే రాబట్టిన సినిమా. ప్రభాస్ కి వెయ్యికోట్లు పెద్ద లెక్కకాదు. బాహుబలి 2, కల్కీ తో రెండు సార్లు వెయ్యికోట్లు రాబట్టాడు. కాకపోతే 2 వేల కోట్లనే తనింతవరకు రీచ్ కాలేదు. ఈ సారి రీచ్ అవటం కాదు, తన రికార్డుని తానే బద్దలు కొడుతు, దంగల్ రికార్డుని కూడా బ్రేక్ చేసేలా ఉన్నాడు. అంత ఖచ్చితంగా ఓ కన్ క్లూజన్ కి రావటానికి కారణం కల్కీ తీసిన నాగ్ అశ్విన్ పేల్చిన బాంబు. కల్కీ లో అసలు కథే లేదని, పాత్రల పరిచయానికి, బేసిక్ స్టోరీ నెరేషన్ కే మొదటి పార్ట్ సరిపోయిందని తేల్చాడు. అసలు కథంతా కల్కీ 2లో ఉందన్నాడు. అంతేకాదు కల్కీలో ఎక్కువ సేపు కనిపించింది అమితాబ్ బచ్చనే. అశ్వద్ధామగా తన పాత్ర ఉన్నంత బలంగా కల్కీలో భైరవ పాత్ర కనిపించలేదు

అయితే కల్కీ సీక్వెల్ లో మాత్రం భైరవ పాత్ర యాక్షన్ మోడ్ లోకి వెళుతుందట. నిజంగా కల్కీలో కర్నుడిగా కాసేపే కనిపించటం వల్లే కల్కీ మూవీ హిట్టైందంటారు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో కామెడీ వర్కవుట్ కాలేదు. సెకండ్ హాఫ్ లో కథ బానేఉన్నా, అమితాబ్ పాత్రకే ఎక్కువ స్కోప్ ఉండటం కాస్త డిసప్పాయింటింగ్ అనిపించింది. కాని క్లైమాక్స్ లో కర్ణుడిగా ప్రభాస్ ట్రాన్స్ ఫర్మేషన్ మతిపోగొట్టింది.ఒక వేల ఆ ఎపిసోడ్ లేకపోతే 1200 కోట్లపైనే ఈ సినిమాకు వచ్చే అవకాశాలు తగ్గేవి.. ఏదేమైనా కాసేపే సాలిడ్ సీన్స్ పెడితే ఈ రేంజ్ లో వసూళ్లొచ్చాయంటే, కల్కీ 2 నిండా ఇలాంటి సీన్లే ఉండే ఛాన్స్ ఉంది.అసలు కథంతా రెండో భాగంలోనే వస్తోందన్నారు కాబట్టి 1200 కోట్ల ప్రాజెక్ట్ కాస్త 2 వేల కోట్లు ట్రెండ్ సెట్టర్ గా మారొచ్చు. ఇదే కాదు ఇంతవరకు పాన్ ఇండియాని షేక్ చేసిన ఏ సినిమా కైనా సీక్వెల్ తీస్తే డబుల్ కలెక్సన్స్ రావటం అనేది కామనైపోయింది.

అలా చూస్తే బాహుబలి 560 కోట్లు రాబడితే, బాహుబలి 2 1850 కోట్లు రాబట్టింది. కేజీయఫ్ 450 కోట్లు రాబడితే, కేజీయఫ్ 2 కి 1300 కోట్లొచ్చాయి. పుష్ప 400 కోట్లు రాబడితే, పుష్ప 2 మూవీ 1800 కోట్లు రికార్డు సొంతం చేసుకుంది. ఇవన్నీ చూస్తే 1200 కోట్లు రాబట్టిన కల్కీ, సీక్వెల్ రూపంలో 2400 కోట్లే మించే ఛాన్స్ ఉంది. ఇంకా బాగుందని టాక్ వస్తే 3000 కోట్లు రాబట్టిన ఫస్ట్ మూవీగా మారే అవకాశం కూడా ఉంది.. ఏదేమైనా ఏడాదిన్నర తర్వాత వచ్చే కల్కీ మీద.