Kalki : కల్కి ట్రైలర్‌ రిలీజ్..

పాన్ ఇండియా (Pan India) రెబెల్ స్టార్ (Rebel Star) ప్రభాస్ (Prabhas) హీరోగా.. హై లెవెల్ గ్రాఫిక్స్‌తో రూపొందుతోన్న మూవీ 'కల్కి 2898 (Kalki 2898AD).. సలార్ (Salar) లాంటి హై ఓల్టేజ్ మూవీ తర్వాత ప్రభాస్‌ నుంచి వస్తున్న మూవీ కావడంతో అంచనాలు స్కై హైగా నిలిచాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 4, 2024 | 11:02 AMLast Updated on: Mar 04, 2024 | 11:02 AM

Kalki Trailer Release

పాన్ ఇండియా (Pan India) రెబెల్ స్టార్ (Rebel Star) ప్రభాస్ (Prabhas) హీరోగా.. హై లెవెల్ గ్రాఫిక్స్‌తో రూపొందుతోన్న మూవీ ‘కల్కి 2898 (Kalki 2898AD).. సలార్ (Salar) లాంటి హై ఓల్టేజ్ మూవీ తర్వాత ప్రభాస్‌ నుంచి వస్తున్న మూవీ కావడంతో అంచనాలు స్కై హైగా నిలిచాయి. టైం ట్రావెల్ కథతో రూపొందుతోన్న ‘కల్కి 2898 ఏడీ’ సినిమాను పాన్ వరల్డ్‌ రేంజ్‌తో తీస్తున్నారు. దీనికి తగ్గట్లుగానే డైరెక్టర్ నాగ్ అశ్విన్ దీన్ని హై రేంజ్‌ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఇక ఈ మూవీకి సంబంధించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా అది సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ లేటెస్ట్ అప్‌డేట్‌ ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తోంది.

ఈ మూవీ నుంచి ఇప్పటి వరకూ వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్ ఈ మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్‌ను పెంచేశాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా ఈ సినిమా ట్రైలర్‌ డేట్ బయటకు వచ్చేసింది. ఫిలింనగర్‌లో వినిపిస్తున్న లేటెస్ట్ బజ్ ప్రకారం కల్కి 2898ఎడి ట్రైలర్‌ ఈ ఏప్రిల్ మొదటి వారంలో వచ్చే ఛాన్స్ ఉందని వినిపిస్తోంది. కరెక్టుగా ఏప్రిల్ నెలకు కల్కి మూవీ రిలీజ్ నెల ఉంటుంది. అందుకే ఏప్రిల్ 9న ట్రైలర్‌ను తీసుకొచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.. అప్పటి నుంచి మూవీ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేస్తారని టాక్ వినిపిస్తోంది.

మే 9 గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాని నిర్మాత అశ్విని దత్ 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ తో కల్కి సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుంది అని అంతా భావిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని, అమితాబ్ బచ్చన్, రానా, రాజేంద్రప్రసాద్.. పలువురు స్టార్స్ నటిస్తుండగా మరికొంతమంది స్టార్స్ కూడా గెస్ట్ అప్పీరెన్స్ ఇస్తారని టాక్ వినిపిస్తోంది. ఇన్ని సర్‌ప్రైజ్‌ల మధ్య తెరకెక్కుతున్న కల్కి మూవీ.. రిలీజ్ తర్వాత ప్రేక్షకులకు ఇంకెన్ని సర్‌ప్రైజ్‌లు ఇస్తుందో చూడాలి మరి..