కల్కీ 2 కంటే ముందే అవతారం.. 10 అవతారాల వెనక…

మ్యాన్ ఆఫ్ మాసెస్ డ్రీమ్ ప్రాజెక్టు దానవీర శూరకర్ణని త్రివిక్రమ్ ఇప్పుడు బన్నీకోసం సినిమాగా మార్చబోతున్నాడనే ప్రచారం మొదలైంది. ఇంతలో సీన్ లో కి పది అవతారాల మాట రీసౌండ్ చేస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 27, 2025 | 04:50 PMLast Updated on: Mar 27, 2025 | 4:50 PM

Kalki Was An Incarnation Before 2 Behind 10 Incarnations

మ్యాన్ ఆఫ్ మాసెస్ డ్రీమ్ ప్రాజెక్టు దానవీర శూరకర్ణని త్రివిక్రమ్ ఇప్పుడు బన్నీకోసం సినిమాగా మార్చబోతున్నాడనే ప్రచారం మొదలైంది. ఇంతలో సీన్ లో కి పది అవతారాల మాట రీసౌండ్ చేస్తోంది. దశావతారం కొత్తకాదు. కమల్ హాసన్ ఎప్పోడో అలాంటి ప్రయోగం చేశాడు. కాని ఇది దశ అవతారాల కథకాదు.. దాని వెనకున్న కథగా ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రమ్. కాకపోతే ఇక్కడే రెబల్ స్టార్ మూవీ కల్కీ 2 తో ఈ సినిమాకు క్లాష్ వచ్చేలా ఉంది. ఆల్రెడీ కల్కీ లో భైరవుడిగా, కర్ణుడిగా కూడా కనిపించిన ప్రభాస్, కల్కీ 2 లో లార్డ్ విష్ణు అవతారంలో కనిపించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. లేదంటే లార్డ్ విష్ణు పాత్రతో కల్కీ 2 సెకండ్ హాఫ్ ని ప్లాన్ చేసినట్టు కూడా లీకులందుతున్నాయి. సో జరుగుతున్న ప్రచారమే నిజమైతే, ఇటు ఎన్టీఆర్ కాన్సెప్ట్ రిస్క్ లో పడినట్టే… అటు కల్కీ 2 పట్టాలెక్కకముందే, ఆ కాన్సెప్ట్ తో బన్నీ ప్రాజెక్ట్ పట్టాలెక్కినట్టే… సో ఏం జరగబోతోంది? టేకేలుక్

కల్కీ 2 మూవీ దసరాకు మొదలయ్యేలా ఉంది. ఈలోపు రాజా సాబ్, ఫౌజీ మూవీలు పూర్తి చేసి, స్పిరిట్ షూటింగ్ తో బిజీ కాబోతున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఎంతలేదన్నా 6 నెలల తర్వాతే కల్కీ 2 ని నాగ్ అశ్విన్ మొదలు పెట్టొచ్చు. ప్రభాస్ కూడా డిసెంబర్ లోనే కల్కీ 2 సెట్లో అడుగుపెట్టే ఛాన్స్ఉంది. ఆలోగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కొంపముంచేలా ఉన్నారట. కల్కీ 2 మూవీ కథకి ప్రాణమైనా కాన్సెప్ట్ నే త్రివిక్రమ్ పాన్ ఇండియా ప్రాజెక్టు గా మార్చబోతున్నాడట. ఇంతవరకు మైథాలజీ సినిమాలాంటే రామాయణం, లేదంటే మహాభారతం బేస్ చేసుకునే సినిమాలు తీశారు. కాని ఎవరూ లార్డ్ విష్ణు మీద సినిమాలు తీయలేదు. విష్ణు అవతారాలైన రాముడు, కృష్ణుడు, పరశురాముడు ఇలానే ఆ అవాతార పురుషుల పురాణాల మీదే సినిమాలొచ్చాయి..

మహా విష్ణువు మీద మాత్రం అంతా సీన్ల వరకే చూపించారు. ఇప్పుడు ఆ అసలు సుప్రీమ్ గాడ్ మీదే సినిమా తీయబోతున్నాడట మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. కాకపోతే ఇక్కడే కల్కీ 2 మూవీకి ఈ సినిమా వల్ల చిక్కొచ్చేలా ఉంది. కల్కీ మూవీ మూల కథ, మహా విష్ణు పదో అవతారంగా కల్కీ జన్మించటం, కలిని సంహసించటం…అది కల్కీ లో చూపించలేదు. అంటే కల్కీ 2 లో ఉండబోయేది అదే అని తేలిపోయింది. యాస్కిన్ అసలు రూపం కలి కాబట్టి, ఆ కలిని సంహరించాక, సీన్ లోకి మహావిష్ణు వస్తాడని, ఆ 30 నిమిషాల సీన్ తోనే సినిమాకు ఎండ్ కార్డు పడుతుందనేది ఇండస్ట్రీలో పెరిగిన ప్రచారం. ఎప్పుడో పార్ట్ 2 కి సంబంధించిన35 శాతం షూటింగ్ అయిపోవటం వల్ల, కల్కీ 2 బేసిక్ ప్లాట్ ఆల్ మోస్ట్ లీకైనట్ట…

సో కల్కీ2 మొదలయ్యేదే ఈ ఏడాది ఎండింగ్ లో అయితే, ఈలోపు త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కనక ముందే పట్టాలెక్కితే, కల్కీ 2 కి గుండె కాయలాంటి కాన్సెప్ట్ మరో మూవీలో ఫోకస్ అయినట్టవుతుంది. బన్నీతో త్రివిక్రమ్ తీసే సినిమా నిజంగా మహా విష్ణు కాన్సెప్ట్ తో వస్తే, కల్కీ 2 లో ఉండాల్సిన ఎగ్జైట్ మెంట్ తగ్గిపోతుంది. అసలే ఎన్టీఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్ దాన వీర శూర కర్ణ ని త్రివిక్రమ్ టార్గెట్ చేశాడనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు కల్కీ 2 కాన్సెప్ట్ కూడా త్రివిక్రమ్ మూవలో రిఫ్లెక్ట్ అయ్యేలా ఉందంటున్నారు. అదే జరిగితే, బన్నీ కోసం ఇద్దరు పాన్ ఇండియా హీరోల సినిమా కథల్లో ఎగ్జైట్ మెంట్ కి పంచ్ పడినట్టౌతుంది.