Kalki new trailer : ఇంతవరకూ ఓడిపోలేదు ఇక ఓడిపోను..
కల్కి’ రిలీజ్ ట్రైలర్ అనుకున్న సమయానికంటే విడుదల కాస్త ఆలస్యమైనా.. అదిరిపోయే విజువల్స్ తో ప్యూర్ విజువల్ వండర్ లా ఉంది.

Kalki's release trailer is a bit late than expected but it looks like a pure visual wonder with breathtaking visuals.
కల్కి’ రిలీజ్ ట్రైలర్ అనుకున్న సమయానికంటే విడుదల కాస్త ఆలస్యమైనా.. అదిరిపోయే విజువల్స్ తో ప్యూర్ విజువల్ వండర్ లా ఉంది. ట్రైలర్ ఆద్యంతం.. నాగ్ అశ్విన్ సృష్టించిన కాశీ, కాంప్లెక్స్, శంభాల లోకాల చుట్టూ తిరుగుతుంది.
భగవంతుడి లోపల సమష్ట సృష్టి ఉంటుందంటారు.. అలాంటిది నీ కడుపులో భగవంతుడే ఉన్నాడు’ అంటూ అమితాబ్ బచ్చన్ దీపిక తో చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమయ్యింది. అక్కడ నుంచి.. కాశీని కాపడడానికి అశ్వథ్థామ చేసే ప్రయత్నాలు.. మధ్యలో భైరవగా ప్రభాస్ ఎంట్రీ.. కొన్ని సన్నివేశాల్లో ప్రభాస్, అమితాబ్ బచ్చన్ మధ్య యుద్ధ సన్నివేశాలు.. కల్కి పాత్రలో విశ్వనటుడు భీకర ఆకారం.. మొదలుకొని ‘కల్కి’ రిలీజ్ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
ఇక.. ట్రైలర్ చివరిలో రోబో సూట్ లో ఎంటరైన ప్రభాస్ ‘ఇంతవరకూ ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు.. ఇది కూడా ఓడిపోను.. ఈసారి ప్రిపేర్ అయి వచ్చాను’ అంటూ చెప్పే డైలాగ్ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది. మొత్తంమీద.. మొదటి ట్రైలర్ లో ‘కల్కి’ ప్రపంచాన్ని పరిచయం చేసిన నాగ్ అశ్విన్.. రిలీజ్ ట్రైలర్ తో ఆ వరల్డ్ లోకి తీసుకెళ్లాడు.