కళ్యాణ్ రామ్ చేతిలో ఆ పార్టీ జెండా.. ఏంటి విషయం.. రాజకీయాల్లోకి వస్తున్నాడా..?
నందమూరి హీరోలకు రాజకీయం అసలు కొత్త కాదు. ఇంకా చెప్పాలంటే రాష్ట్ర రాజకీయం పుట్టింది వాళ్ళ ఇంట్లో. అప్పట్లో నందమూరి తారకరామారావు పార్టీ పెట్టిన 8 నెలల్లోనే విజయం సాధించడమే కాకుండా..

నందమూరి హీరోలకు రాజకీయం అసలు కొత్త కాదు. ఇంకా చెప్పాలంటే రాష్ట్ర రాజకీయం పుట్టింది వాళ్ళ ఇంట్లో. అప్పట్లో నందమూరి తారకరామారావు పార్టీ పెట్టిన 8 నెలల్లోనే విజయం సాధించడమే కాకుండా.. ముఖ్యమంత్రి పీఠం కూడా ఎక్కాడు. తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయిన గొప్ప నాయకుడిగా మిగిలిపోయాడు ఎన్టీఆర్. అన్నగారు చూపిన బాటలోనే నందమూరి వారసులు కూడా నడుస్తున్నారు. ఆయన పెట్టిన తెలుగుదేశం పార్టీలోనే ఇప్పటికీ ఆ హీరోలంతా ఉన్నారు. వాటికి ఎప్పుడు ఏ అవసరం వచ్చిన తర్వాత ముందు ఉంటానని ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ చాలా సార్లు చెప్పాడు. ఈయన తెలుగుదేశంలో యాక్టివ్ గా లేడు.. పార్టీని పట్టించుకోవడం లేదు.. కొన్నిసార్లు అవతలి పార్టీలు తెలుగుదేశం పార్టీని తిడుతున్నా కూడా జూనియర్ స్పందించడం లేదు అంటూ ఆయన మీద పార్టీ పెద్దలు చాలామంది గుర్రుగా ఉన్నారు. అయితే అవి ఏమి పట్టించుకోకుండా సినిమాలతో బిజీగా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్. తనకు ప్రస్తుతం సినిమా కెరీర్ ముఖ్యమని.. రాజకీయాల గురించి ఆలోచించే వయసు గానీ అనుభవంగానే తన దగ్గర లేదు అంటూ చెప్పుకొచ్చాడు ఈయన.
2009 ఎన్నికల ప్రచారం తర్వాత.. పార్టీ ఓడిపోవడంతో పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యాడు జూనియర్. ఆయన మాత్రమే కాదు తారక్ అన్నయ్య కళ్యాణ్ రామ్ కూడా ఎప్పుడు రాజకీయాల్లో కనిపించింది లేదు. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ అయినా అప్పుడప్పుడు అలా పాలిటిక్స్ గురించి మాట్లాడతాడేమో కానీ.. కళ్యాణ్ రామ్ మాత్రం అస్సలు అటువైపు వెళ్ళింది లేదు. కానీ ఎప్పుడూ తెలుగుదేశంలోనే తాము ఉంటామని.. అది తమ తాత పెట్టిన పార్టీ కాబట్టి ప్రాణం ఉన్నంతవరకు దానికోసం ఏం చేయడానికైనా సిద్ధం అంటూ కళ్యాణ్ రామ్ గతంలో కూడా చాలా సార్లు చెప్పాడు. తాజాగా అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా ప్రమోషన్స్ కోసం నరసరావు పేట వెళ్లిన కళ్యాణ్ రామ్.. అక్కడ తెలుగుదేశం జెండా పట్టుకుని కనిపించాడు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నరసరావుపేటలోకి ఎంటర్ అయినప్పటి నుంచి.. కళ్యాణ్ రామ్ ఊహించిన దాని కంటే ఎక్కువ ఆదరణ లభించింది. దారి పొడవునా తెలుగుదేశం కార్యకర్తలు, నందమూరి అభిమానులు కళ్యాణ్ రామ్ కు ఘన స్వాగతం పలికారు. తన కారు పక్కన అభిమానులు తెలుగుదేశం జెండా పట్టుకుని పరుగులు పెడుతుంటే.. అడిగిమరీ ఆ జెండాను చేతుల్లోకి తీసుకున్నారు కళ్యాణ్ రామ్.
దానిమీద జనసేన కూడా ఉంది. తెలుగుదేశం జెండాతో కళ్యాణ్ రామ్ ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఆయన కూడా రాజకీయాల వైపు ఆసక్తి చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు కాకపోయినా ఖచ్చితంగా ఫ్యూచర్లో అయినా తన తాత పెట్టిన పార్టీ కోసం మనవళ్లు ముందు నడుస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. జూనియర్ ఎన్టీఆర్ రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తన బ్యాక్ గ్రౌండ్ ఇప్పటినుంచే రెడీ చేసుకుంటున్నాడు అని సోషల్ మీడియాలో చర్చ బాగానే జరుగుతుంది. మరోవైపు కళ్యాణ్ రామ్ కూడా తమ్ముడు వెంటే నడుస్తున్నాడు. అయినా నందమూరి వారసులకు రాజకీయం అనేది కొత్తగా నేర్పించాల్సిన అవసరం లేదు. అది వాళ్ళ రక్తంలోనే ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు రాజకీయాలు స్వేచ్ఛగా చేసుకునే అధికారం కూడా వాళ్లకు ఉంది. దానికి సరైన సమయం రావాలి అంతే. అది వచ్చినప్పుడు వాళ్ళని ఎవరు ఆపరు.