Kamal Haasan: అపూర్వ కలయిక.. 36 ఏళ్ల తర్వాత కమల్‌, మణి కాంబినేషన్..

మణిరత్నం.. ఇప్పుడు కమల్‌తో థగ్ లైఫ్ ప్రాజెక్ట్ ఫిక్స్ చేసుకున్నాడు. ప్రి పొడక్షన్ దశలో ఉన్న ఈ మూవీ.. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కనుంది. 36 ఏళ్ల తర్వాత కమల్, మణిరత్నం కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో అంచనాలు ఎవరెస్ట్ ఎక్కాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 12, 2023 | 06:12 PMLast Updated on: Dec 12, 2023 | 6:12 PM

Kamal Haasan And Mani Ratnam Come Together After 36 Years For Thug Life

Kamal Haasan: కోలీవుడ్‌లో క్రేజీ కాంబో సెట్ అయింది. 36 ఏళ్ల తర్వాత కమల్, మణిరత్నం కలిసి సినిమా చేయబోతున్నారు. ప్రజెంట్ ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అయితే ఈ సినిమా కోసం పర్ఫెక్ట్‌ టార్గెట్ ఫిక్స్ చేశాడట డైరెక్టర్. 6 నెలల్లో మొత్తం షూటింగ్ ఫినిష్ చేసేలా పక్కా ప్లానింగ్ రెడీ చేస్తున్నాడట. పొన్నియన్ సెల్వన్‌తో హిట్ కొట్టిన మణిరత్నం.. ఇప్పుడు కమల్‌తో థగ్ లైఫ్ ప్రాజెక్ట్ ఫిక్స్ చేసుకున్నాడు.

PRABHAS: ప్రభాస్‌కు సలార్ సినిమా నచ్చలేదా..? ప్రమోషన్‌కు రావడం లేదెందుకు..?

ప్రి పొడక్షన్ దశలో ఉన్న ఈ మూవీ.. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కనుంది. 36 ఏళ్ల తర్వాత కమల్, మణిరత్నం కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో అంచనాలు ఎవరెస్ట్ ఎక్కాయి. దానికి తగ్గటే ఈ మూవీని మల్టీస్టారర్‌గా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇందులో త్రిష హీరోయిన్‌గా నటిస్తుంటే.. జయం రవి, దుల్కర్ సల్మాన్ కీలకపాత్రలో కనిపించబోతున్నారు. కమల్ ప్రాజెక్ట్‌ని కేవలం 6 నెలల్లో పూర్తి చేయాలని మణిరత్నం టార్గెట్‌గా పెట్టుకున్నాడట. పక్కా ప్లానింగ్‌తో, తక్కువ టైంలో షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసేలా షెడ్యూల్స్ రెడీ చేస్తున్నాడు.

పొన్నియన్ సెల్వన్ 2 షూటింగ్ కేవలం 150 రోజుల్లోనే పూర్తి చేశాడు మణిరత్నం. కమల్ మూవీకి కూడా ఇదే స్ట్రాటజీ అప్లై చేస్తున్నాడు. అయితే కమల్, మణిరత్నం ఇద్దరి వయసు ఇప్పుడు 65ఏళ్లు. ఈ ఏజ్‌లో 6 నెలల టార్గెట్ అనేది భారీ ఛాలెంజ్. మరి దీన్ని ఎలా అధిగమిస్తారో చూడాలి.