Kamal Haasan: కమల్‌, మణిరత్నం కాంబినేషన్‌కి తిరుగులేదా..!

పొన్నియన్ సెల్వన్ సిరీస్‌లో హిట్ కొట్టిన మణిరత్నం ఇప్పుడు కమల్ హాసన్‌తో తన కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ పొడక్షన్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోతోంది. 36 ఏళ్ల తర్వాత కమల్, మణిరత్నం కలిసి మూవీ చేయబోతూ ఉండటం విశేషం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 23, 2023 | 03:49 PMLast Updated on: Oct 23, 2023 | 3:49 PM

Kamal Haasan And Mani Ratnam Movie Will Complete In Five Months

Kamal Haasan: కోలీవుడ్‌లో క్రేజీ కాంబో సెట్ అయింది. 36 ఏళ్ల తర్వాత కమల్ హాసన్, దర్శకుడు మణిరత్నం కలిసి సినిమా చేయబోతున్నారు. ప్రజెంట్ ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అయితే ఈ సినిమా కోసం టార్గెట్ ఫిక్స్ చేశాడట డైరెక్టర్. 5 నెలల్లో షూటింగ్ పూర్తి చేసేలా ప్లానింగ్ రెడీ చేస్తున్నాడట. పొన్నియన్ సెల్వన్ సిరీస్‌లో హిట్ కొట్టిన మణిరత్నం ఇప్పుడు కమల్ హాసన్‌తో తన కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ పొడక్షన్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోతోంది.

36 ఏళ్ల తర్వాత కమల్, మణిరత్నం కలిసి మూవీ చేయబోతూ ఉండటం విశేషం. ఈ ప్రాజెక్ట్‌ని సిల్వర్ స్క్రీన్‌పై మల్టీస్టారర్ మూవీగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా నటిస్తూంటే జయం రవి, దుల్కర్ సల్మాన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ని కేవలం 5నెలల్లో పూర్తి చేయాలని మణిరత్నం టార్గెట్ పెట్టుకున్నాడట. పక్కా ప్లానింగ్‌తో తక్కువ టైం లో షూటింగ్ కంప్లీట్ చేయాలని డిసైడ్ అయ్యాడట.

పొన్నియన్ సెల్వన్ 2 షూటింగ్‌ని కేవలం 150 రోజుల్లోనే పూర్తి చేశాడు మణిరత్నం. కమల్ మూవీకి కూడా ఇదే స్ట్రాటజీ అప్లై చేస్తున్నాడట. అయితే కమల్, మణిరత్నం ఇద్దరి వయసు ఇప్పుడు 65 ఏళ్లు. ఈ వయసులో ఈ టాలెంటెడ్ ఐకాన్స్ 5 నెలల టార్గెట్‌లో సినిమా పూర్తి చేయడం అనేది విశేషమే. మరి ఇంత జెట్ స్పీడ్‌లో ఎలాంటి కంటెంట్ అందిస్తారో చూడాలి.