Kamal Haasan: కాపీ క్యాట్.. మణిరత్నం మూవీ ఆ సినిమాకు కాపీనా..?

రైజ్ ఆఫ్ స్కై వాకర్ అనే హాలీవుడ్ మూవీలోని కొన్ని సీన్స్ థగ్ లైఫ్‌ టైటిల్ రిలీల్‌లో కనిపించాయి. ఆ రెండు మూవీస్ స్టిల్స్ పక్కపక్కన పెట్టి మరీ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. అగ్ర దర్శకుడు మణిరత్నం కూడా కాపీ కొడతారా.. మిగతా భాషల సీన్స్ తీసుకుంటారా.. లేదంటే ప్రేరణ పొందుతారా అని నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 8, 2023 | 05:17 PMLast Updated on: Nov 08, 2023 | 5:17 PM

Kamal Haasan And Mani Ratnams Next Titled Thug Life Is A Copy

Kamal Haasan: విశ్వ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan), లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం (Mani Ratnam) కాంబోలో వస్తోన్న మూవీపై ట్రోలర్స్ కన్ను పడింది. ఈ సినిమాకు థగ్ లైఫ్ (Thug Life) అనే టైటిల్ ఖరారు చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో చూసి ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. కమల్-మణి కాంబో అదిరిందని.. సూపర్ మూవీ రాబోతుందని ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ ఇంతలోనే.. ఆ టైటిల్ రివీల్ సీన్ హాలీవుడ్ మూవీకి కాపీలా ఉందని కనిపెట్టేశారు.

Devara: భయానికి మరో కొత్త పేరు దేవర.. 150 రోజుల్లో ఊచకోత

రైజ్ ఆఫ్ స్కై వాకర్ అనే హాలీవుడ్ మూవీలోని కొన్ని సీన్స్ థగ్ లైఫ్‌ టైటిల్ రిలీల్‌లో కనిపించాయి. ఆ రెండు మూవీస్ స్టిల్స్ పక్కపక్కన పెట్టి మరీ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. అగ్ర దర్శకుడు మణిరత్నం కూడా కాపీ కొడతారా.. మిగతా భాషల సీన్స్ తీసుకుంటారా.. లేదంటే ప్రేరణ పొందుతారా అని నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. చిన్న వీడియోతోనే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. విక్రమ్ మూవీ హిట్‌తో కమల్ హాసన్ మంచి ఊపు మీద ఉన్నారు. పొన్నియన్ సెల్వన్ రెండు పార్టులు చేసి మణిరత్నం మంచి జోష్ మీద ఉన్నారు. ఈ ఇద్దరి హిట్ల తర్వాత వీరి కాంబోలో మూవీ వస్తోంది.

PRABHAS: సలార్ ఈజ్ బ్యాక్.. హైదరాబాద్‌లో ల్యాండ్ అయిన ప్రభాస్..!

సీన్స్ కాపీ చేయడంతో ఒక్కసారిగా వచ్చిన హైప్ పోయింది. అంతకుముందు మూవీ, స్టోరీ, నటులు దుల్కర్ సల్మాన్, జయం రవి, త్రిష, ఏఆర్ రహమాన్ మ్యూజిక్ ఇవ్వడంతో మంచి హైప్ వచ్చింది. కానీ ఫోటోలు లీక్ కావడంతో ఒక్కసారిగా తుస్సుమంది. మరి ట్రోలింగ్‌పై మేకర్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.