Kamal Haasan: ప్రాజెక్ట్‌-కే లో అడుగుపెట్టిన కమల్‌ హాసన్‌.. 50 ఏళ్ల తర్వాత అంటూ ట్వీట్

ప్రాజెక్ట్‌ కే గురించి కమల్‌ హాసన్‌ ట్విటర్‌లో పోస్ట్ పెట్టాడు. తాను ప్రాజెక్ట్‌-కే లో నటిస్తున్నట్టు ప్రకటించాడు. 50 ఏళ్ల క్రితం తాను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్న టైంలో అశ్వనీదత్‌ ఓ స్టార్‌ ప్రొడ్యూసర్‌ అని.. 50 ఏళ్ల తరువాత ఇప్పుడు ఆయన నిర్మాణ సారథ్యంలో సినిమా చేయడం సంతోషంగా ఉందన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 26, 2023 | 11:13 AMLast Updated on: Jun 26, 2023 | 11:13 AM

Kamal Haasan Enters In To The Sets Of Projectk Kamal Haasan Tweeted About The Movie

Kamal Haasan: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా వస్తున్న ప్రాజెక్ట్‌ కే నుంచి వరుస అప్‌డేట్లు ఇస్టూ ఆడియన్స్‌లో ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తున్నారు మేకర్స్‌. ఈ సినిమాలో ప్రభాస్‌కు ప్రతినాయకుడిగా కమల్‌ హాసన్‌ నటించబోతున్నారంటూ కొన్ని రోజుల నుంచి గాసిప్స్‌ వస్తున్నాయి. మూవీ టీం నుంచి ఎలాంటి అప్‌డేట్‌ లేకపోవడంతో ఇది ఫేక్‌ న్యూస్‌ అని అంతా అనుకున్నారు.

కానీ ఆ గాసిప్స్‌ను నిజం చేస్తూ కమల్‌ హాసన్‌ ట్విటర్‌లో పోస్ట్ పెట్టాడు. తాను ప్రాజెక్ట్‌-కే లో నటిస్తున్నట్టు ప్రకటించాడు. 50 ఏళ్ల క్రితం తాను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్న టైంలో అశ్వనీదత్‌ ఓ స్టార్‌ ప్రొడ్యూసర్‌ అని.. 50 ఏళ్ల తరువాత ఇప్పుడు ఆయన నిర్మాణ సారథ్యంలో సినిమా చేయడం సంతోషంగా ఉందన్నారు. తాను చేసే ప్రతీ సినిమాను మొదటి సినిమాగానే భావిస్తానని.. నాగ్‌అశ్విన్‌ విజన్‌ ప్రపంచాన్ని మెప్పించబోతోందంటూ ట్వీట్‌ చేశాడు. ఇక కమల్‌ హాసన్‌కు వెల్కం చెప్తూ వైజయంతీ మూవీస్‌ కూడా ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. బిగ్‌ బీ అమిత్‌ బచ్చన్‌ కూడా కమల్‌కు వెల్కం చెబుతూ పోస్ట్‌ చేశాడు. కమల్‌ హాసన్‌తో కలిసి సినిమా చేయాలనేది తన కల అని.. 50 ఏళ్ల తరువాత ఇప్పుడు ఆ కల నెరవేరబోతోందంటూ ట్వీట్‌ చేశాడు.

కమల్‌ హాసన్‌ ఎంట్రీతో ప్రాజెక్ట్‌-కే సినిమా మీద అంచనాలు నెక్స్ట్‌ లెవెల్‌కు వెళ్లిపోయాయి. ఈ సినిమా కోసం కమల్‌కు మూవీ మేకర్స్‌ పెద్ద మొత్తంలోనే రెమ్యునరేషన్‌ ఇచ్చినట్టు సమాచారం. ఇక సినిమాలో కమల్‌ క్యారెక్టర్‌ను దర్శకుడు ఎలా డిజైన్‌ చేశాడో.. ఎలా ప్రొజెక్ట్‌ చేస్తాడో చూడాలి.