Kamal Haasan: కల్కిపై కమల్ హాసన్ లీక్.. భలే ట్విస్ట్
ప్రముఖ నటుడు కమల్ హాసన్ కల్కి సినిమాపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ షికార్లు చేస్తున్నాయి. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మకమైన సినిమా కల్కిలో.. స్టార్ యాక్టర్ కమల్ హాసన్ కూడా నటిస్తున్నాడు.

Kamal Haasan: రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న “కల్కి 2898 AD” చిత్రం షూటింగ్ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో అప్‌డేట్స్ ఎప్పటికపుడు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. దీనితో రోజురోజుకి కల్కి సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌పై కూడా కొన్ని చర్చలు జరిగాయి.
CM RAMESH: అనకాపల్లిలో జగన్ భారీ వ్యూహం.. ఆయనకు అందుకే టికెట్.. సీఎంకు చుక్కలేనా..?
కానీ, మేకర్స్ నుంచి మాత్రం ఏ క్లారిటీ రాలేదు. ఈ క్రమంలో ప్రముఖ నటుడు కమల్ హాసన్ కల్కి సినిమాపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ షికార్లు చేస్తున్నాయి. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మకమైన సినిమా కల్కిలో.. స్టార్ యాక్టర్ కమల్ హాసన్ కూడా నటిస్తున్నాడు. దీనితో అభిమానులు ప్రభాస్ – కమల్ మధ్య వచ్చే సీన్స్ గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే, తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కమల్ హాసన్ కల్కి సినిమాలో తన పాత్ర గురించి.. కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో కేవలం గెస్ట్ రోల్‌లో మాత్రమే కనిపించనున్నట్లు కమల్ రివీల్ చేశాడు.
చాలా మంది ఈ సినిమాలో కమల్ విలన్ పాత్రలో నటిస్తున్నారేమో అనే ఊహల్లో ఉన్నారు. కానీ, కమల్ మాత్రం గెస్ట్ రోల్‌లోనే నటించారట. అంటే ఇంచు మించు విక్రమ్ సినిమాలో వచ్చే రోలెక్స్ పాత్రలా ఉండొచ్చేమో అని అభిమానులు అంచనా వేస్తున్నారు. సో.. దీనిపై కమల్ అయితే క్లారిటీ ఇచ్చారు. కానీ, అతని పాత్ర ఏమై ఉంటుందో మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే మరి.