Prabhas: ప్రాజెక్ట్ Kలో ప్రభాస్‌తో కమల్ హాసన్.. పాత్ర ఏంటో తెలిస్తే అవాక్కవుతారు..
ఆదిపురుష్ డిజాస్టర్ తర్వాత.. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ప్రశాంత్ నీల్, నాగి మీదే ఆశలు పెట్టుకున్నారు. సలార్ ఈ ఇయర్ విడుదలకు రెడీ అవుతుండగా.. ప్రాజెక్ట్ K నెక్ట్స్ ఇయర్ పలకరించబోతోంది.

Kamal Hassan Special Role In Project K
సలార్ సంగతి ఎలా ఉన్నా.. ప్రాజెక్ట్ Kకు సంబంధించి కీలక అప్డేడ్ వచ్చింది. యూనివర్సల్ స్టార్, ఉలగ నాయకన్ కమల్‌హాసన్.. ఈ మూవీలో ప్రభాస్‌తో కలిసి యాక్ట్ చేయబోతున్నాడు. ఇప్పటికే హైప్ పీక్స్‌కు చేరగా.. ఈ అనౌన్స్‌మెంట్‌తో అంతకుమించి అనిపిస్తోంది సీన్. విక్రమ్ మూవీతో ఈ మధ్యే కమల్‌హాసన్ సూపర్ హిట్ కొట్టాడు. తాను ఇంకా ఫామ్‌లోనే ఉన్నానని.. యంగ్ హీరోలకు సవాల్ విసిరాడు. ఇండియన్ 2 చేస్తున్న కమల్‌హాసన్.. ప్రాజెక్ట్ Kలో కనిపించేందుకు సిద్ధం కావడంతో.. అభిమానుల ఆనందానికి హద్దు లేకుండా ఉంది.
భూమి మొత్తాన్ని కవర్ చేసే ఓ వ్యక్తి నీడ కావాలి. ఆ వ్యక్తే ఉలగ నాయకన్ అంటూ.. ప్రాజెక్ట్ K టీమ్ కమల్‌హాసన్ రోల్ గురించి పరిచయం చేసింది. ఏలియన్స్ వర్సెస్ సైంటిస్టులు అంటూ.. ఓ స్టోరీ చక్కర్లు కొడుతోంది. ఏలియన్స్ ఎటాక్ చేసినప్పుడు.. ఇక్కడ భూమిని కాపాడే కీలక పాత్రల్లో కమల్ హాసన్ రోల్ కూడా ఒకటి ఉంటుందా అనే చర్చ అభిమానుల్లో మొదలైంది. ఏమైనా రోజురోజుకు ప్రాజెక్ట్ K మీద హైప్ పెరుగుతోంది. ఇప్పటికే ఈ మూవీలో దీపికా పదుకొనే, బిగ్ బి వంటి స్టార్స్ భాగం అయ్యారు. ప్యాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ స్థాయి సినిమా అని పదేపదే చెప్తున్న డైరెక్టర్ నాగి.. ఇదే నిజం చేయబోతున్నాడని అనిపిస్తోంది.
బిగ్‌బి, దీపికాతో పాటు ఇప్పుడు కమల్ హాసన్ కూడా మూవీలో భాగం కావడం.. సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేస్తోంది. కమల్ ఇప్పటికే మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్నాడని తెలుస్తోంది. ఈ ముగ్గురితో పాటు దిశా పటానీ కూడా ప్రాజెక్ట్ Kలో కీ రోల్ ప్లే చేస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా.. ప్రాజెక్ట్ Kను రిలీజ్ చేయబోతున్నారు. దాదాపు 5వందల కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే 75శాతానికి పైగా సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది.