అఖండ కోసం ఉళగ నాయగన్, పవర్ ఫుల్ రోల్ లో కమల్
అఖండ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సక్సెస్ అయిన తర్వాత నట సింహం నందమూరి బాలకృష్ణ రూట్ మారిపోయింది. అప్పటి వరకు బాలయ్య సాదా సీదాగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళినా అఖండ హిట్ తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో ఫోకస్ చేస్తున్నాడు బాలయ్య.
అఖండ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సక్సెస్ అయిన తర్వాత నట సింహం నందమూరి బాలకృష్ణ రూట్ మారిపోయింది. అప్పటి వరకు బాలయ్య సాదా సీదాగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళినా అఖండ హిట్ తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో ఫోకస్ చేస్తున్నాడు బాలయ్య. అందుకే ఇప్పుడు ఆయన చేసే సినిమాలు అన్నీ కమర్షియల్ యాంగిల్ లో ఉంటున్నాయి. కమర్షియల్ యాంగిల్ కు దూరంగా ఉండే బాలయ్య… ఇప్పుడు వసూళ్ళపై ఫోకస్ చేసి… ఏడు పదుల వయసు దగ్గర పడుతున్నా… వందల కోట్లపై ఫోకస్ చేస్తున్నాడు.
తమిళ సీనియర్ స్టార్ హీరోలు ఫాలో అవుతున్న ఎలివేషన్ ట్రెండ్ ను బాలయ్య కూడా ఫాలో అవుతూ… సినిమాను మాస్, క్లాస్ ఆడియన్స్ కు దగ్గర చేస్తూ ఫ్యూచర్ ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు డాకూ మహారాజ్ లైన్ లో ఉంది. ఆ తర్వాత అఖండ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్ళింది. డాకూ మహారాజ్ మార్కెట్ ను నార్త్ లో భారీగా పెంచేందుకు అక్కడ ప్రమోషన్స్ కోసం సీనియర్ హీరో ఒకరిని వాడుకోవాలని ప్లాన్ చేసాడు. అలాగే ఇప్పుడు… అఖండ సీక్వెల్ విషయంలో తమిళ మార్కెట్ ను టార్గెట్ చేసాడు బాలయ్య.
సీక్వెల్ లో తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ కు కీ రోల్ ప్లాన్ చేసారు అఖండ మేకర్స్. కమల్ హాసన్ ను నెగటివ్ రోల్ లో చూపించడానికి రెడీ అయ్యారు. ఆయన పాత్రను పవర్ ఫుల్ గా డిజైన్ చేసాడు బోయపాటి. ఇందుకోసం కమల్ 8 కోట్లు డిమాండ్ చేసినట్టుగా టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. హిందూ మార్కెట్ ను బాలయ్య ఎక్కువ టార్గెట్ చేసాడు. అఖండ నార్త్ లో హిట్ కావడానికి అదే హెల్ప్ చేసింది. తమిళంలో శివుడ్ని బేస్ చేసుకుని వచ్చే సినిమాలకు మంచి మార్కెట్ ఉంటుంది.
అందుకే అఖండలో కమల్ కు మెయిన్ రోల్ ఇచ్చేలా బాలయ్య ప్లాన్ చేసినట్టు టాక్. ఇప్పటికే సినిమాలో పవర్ ఫుల్ సీన్స్ షూటింగ్ స్టార్ట్ అయింది. వచ్చే నెల 20 నుంచి షూట్ ను నార్త్ లో ప్లాన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాల కారణంగా బాలయ్య బిజీగా ఉండటంతో షూట్ ను కాస్త వాయిదా వేసింది అఖండ టీం. ఇప్పుడు బాలయ్య మళ్ళీ షెడ్యూల్ ఇవ్వడంతో సినిమా షూట్ ను మళ్ళీ లైన్ లో పెడుతున్నారు. ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ కీ రోల్ ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే.