మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని ఊహించని రీతిలో అవమానించిన హీందీ నటుడు కమ్ రివ్యూరైటర్... ఇప్పుడు, తన ఫ్రెండ్ చరణ్ మీద పడ్డాడు. గ్లోబల్ స్టార్ ని తీవ్రంగా అవమానిస్తున్నాడు. ఎలా పట్టాడో కాని, అల్లు ఆర్మీని కూల్ చేయాలంటే, చరణ్, ఎన్టీఆర్ ని తిట్టాలనేలా స్కెచ్ వేశాడు.. అలా మెగా ఫ్యాన్స్ పల్స్ పట్టేసినట్టున్నాడు. హిందీ మార్కెట్ లో తెలుగు హీరోల డామినేషన్ తట్టుకోలేకే, బాలీవుడ్ బ్యాచ్, డాష్ ఖాన్ ని వాడుతోందనే కామెంట్స్ ఉన్నాయి. ఇలాంటి టైంలో డాష్ ఖాన్ వచ్చాడు.చరణ్ ముఖాన్ని, తన ఎక్స్ ప్రెషన్స్ ని మొత్తంగా ట్యాలెంట్ నే తీసి పడేస్తూ అవమాన పరుస్తున్నాడు. అందుకు బన్నీ పేరు వాడుకుంటున్నాడు కూడా.... విచిత్రం ఏంటంటే ఈ డాష్ ఖానే గతంలో ఎన్టీఆర్ ని ఎలుగు బంటన్నాడు. ప్రభాస్ ని లేజీ స్టార్ అన్నాడు. మహేశ్ ని అయితే ఇక మాటల్లో చెప్పలేం... ఒకసారి తన మీద కేసైనా, తను జైలుకెళ్లి వచ్చినా బుద్దిరాలేదంటున్నారు. ఇంతకి చరణ్ కి తాను చేసిన అవమానమేంటి? తెలుగు హీరోల మీద తనకెందుకు అంత కసి... త్రిబుల్ ఆర్ మూవీ రిలీజ్ టైంలో, మ్యాన్ ఆఫ్ మాసెస్ ని ఎలుగు బంటితో పోల్చిన దిక్కుమాలినా యూట్యూబర్ కమల్ ఆర్ ఖాన్ ఇప్పుడు మరింత రెచ్చిపోయాడు. నిజానికి ఏనుగు నడుస్తుంటే కుక్కలు మొరుగుతాయనేది అక్షర సత్యం.. సూపర్ స్టార్ రజినీకాంత్ చెప్పినట్టు మొరగని కుక్కలేదు, గొడవలేని ఇల్లు లేదు, కాబట్టి లైట్ తీసుకోవాలి... కాని ప్రతీ సారి అలానే వదిలేస్తే కుక్క కాటుకి చెప్పుదెబ్బ ఇవ్వకుంటే ఎలా అన్న ప్రశ్నలు ఎదురౌతున్నాయి ఇప్పుడీ డిస్కర్షన్ రావటానికి కారణం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మీద కమల్ ఆర్ ఖాన్ చేసిన కామెంట్లు... ఆ కామెంట్లు మెగా ఫ్యాన్సే కాదు, ఎవరికైనా మండిపోయేలా ఉన్నాయి. జెంటా ముఖంలాంటి హీరో అంటూ కామెంట్ చేయటమే కాదు, బన్నీ ట్యాలెంట్ లో చరణ్ 0.001పర్సెంట్ కూడా ఉండదన్నారు. ఇవే కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ నే కాదు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని, రెబల్ ఫ్యాన్స్ తోపాటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని కూడా గెలికాయి. చరణ్ ని అంటే ఎన్టీఆర్, అండ్ కో ఫ్యాన్స్ రెస్పాండ్ అవ్వాలని లేదు. కాని కమల్ ఆర్ ఖాన్ అనే యూ ట్యూబర్ గతంలో ఎలా తారక్, ప్రభాస్, మహేశ్ ని టార్గెట్ చేశాడో ఫైల్ షాట్స్ ని పోస్ట్ చేస్తూ కూడా ఎటాక్ షురూ చేశారు హీరోల ఫ్యాన్స్ నిజంగానే కమల్ ఆర్ ఖాన్ అయే నార్త్ ఇండియా యూ ట్యూబల్ గతంలో బాలీవుడ్ హీరోలు సౌత్ స్టార్స్ లా గలీజ్ గా ఉండరంటూ, పుష్ప రిలీజ్ టైంలో బన్నీని ఘోరంగా అవమానించాడు. కట్ చేస్తే అదే బన్నీని ఇప్పుడు మెగా హీరోలు తొక్కేయాలనుకుంటున్నారంటూ పుష్ప2 రిలీజ్ టైంలో వెనకేసుకొచ్చాడు. ఇక త్రిబుల్ ఆర్ మూవీ రిలీజ్ అయిన టైంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని చూసి, కండల వీరుడు కాదు... ఎలుగుబంటిలా ఉన్నాడంటూ నీచంగా మాట్లాడాడు.. ఇక రాధేశ్యామ్ విడుదల టైంలో ప్రభాస్ ని లేజీ స్టారని, మహేశ్ బాబుని ఎక్స్ ప్రెషన్ లేని ముఖం అంటూ నోరు జారాడు.. అప్పట్లో ఆ హీరోల ఫ్యాన్స్ గట్టిగా వేసుకోవటమే కాదు, జమానాలో ఇలా నోరు జారితేనే జైలుకెళ్లే పరిస్థితొచ్చింది. అయినా బుద్ది మారినట్టు లేదు. సెన్సేషన్ కోసం, యూ ట్యూబ్ లో వ్యూస్ కోసం ఇంతకు తెగించాడు. మెగా పవర్ స్టార్ చరణ్ ని బాడీ షేమింగ్ చేశాడు. అందుకే సీన్లోకి మెగా ఫ్యాన్సే కాదు, ఎన్టీఆర్ అభిమానులతో సహా, రెబల్ ఫ్యాన్స్ కూడా వచ్చేశారు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ అయితే గట్టిగా ఎటాక్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ యూఎస్ లో సెటిలైన తెలుగు ఫ్యాన్స్ కమల్ ఆర్ ఖాన్ కి ఇస్తున్ కౌైంటర్స్ లో రచ్చ రంబోలా అవుతున్నట్టుంది. [embed]https://www.youtube.com/watch?v=VoznvoKO9-g[/embed]