kamal haasan : కమల్ హాసన్ మాటలకి సిద్దార్ధ్ కన్నీళ్లు
విశ్వకధానాయకుడు కమల్ హాసన్ తీరే వేరు. అగ్ర హీరోని అనే గర్వం ఈసమంతైనా ఉండదు. మాట్లాడే ప్రతి మాట కూడా హృదయం నుంచి వస్తుంది.

Kamal's upcoming movie Bharatiyadudu 2 will release worldwide on July 12.
విశ్వకధానాయకుడు కమల్ హాసన్ తీరే వేరు. అగ్ర హీరోని అనే గర్వం ఈసమంతైనా ఉండదు. మాట్లాడే ప్రతి మాట కూడా హృదయం నుంచి వస్తుంది. ఈ విషయం చాలాసార్లు నిరూపితమైంది. ఇలాంటి సంఘటన ఒకటి తాజాగా మరోసారి జరిగింది.
కమల్ అప్ కమింగ్ మూవీ భారతీయుడు 2. వరల్డ్ వైడ్ గా జులై 12 న విడుదల అవుతుంది. ఈ మేరకు తెలుగు నాట ప్రమోషన్స్ జోరందుకున్నాయి. తాజాగా తెలుగు రిలీజ్ కి సంబంధించి మీడియా సమావేశం జరిగింది. కమల్ తో పాటు సినిమాలో కీలక పాత్రల్లో నటించిన సిద్దార్ధ్ , రకుల్ ప్రీత్, బాబీ సింహ, దర్శకుడు శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో సిద్దార్ధ్ ని ఉద్దేశించి కమల్ మాట్లాడుతూ చాలా స్టేజి ల మీద సిద్దార్ధ్ నన్ను తన గురువు అని, ఏకలవ్య శిష్యుడ్ని అని చెప్తాడు. కానీ నేను గొప్ప కాదు. ఎందుకంటే నాకు కూడా ఒక గురువు ఉన్నాడు. అంతటీ శక్తీ కళకి ఉంది. అదే విధంగా ప్రతి వ్యక్తి సినీ జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అది సిద్దార్ధ్ ఒక్కడికే కాదు నాకు కూడా వచ్చాయి. ఇక ఈ సినిమాతో సిద్దార్ధ్ రీ ఎంట్రీ ఇచ్చినట్టే. చాలా అద్భుతంగా నటించాడు.
అలాగే ఇంకా మోర్ కమల్ హాసన్, మోర్ సిద్దార్ధ్ రావాలని కూడా చెప్పాడు. ఇక ఈ మాటలకి సిద్దార్ధ్ కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.రకుల్ ప్రీత్, బాబీ డియోల్ ని కూడా కమల్ పొగిడాడు. కమల్ మాటలకి అక్కడున్న వాళ్ళందరు ఫిదా అయ్యారు. ఇప్పుడు ఇండియాలో ఎక్కడ చూసినా ఇండియన్ 2 ఎలా ఉంటుందనే విషయం గురించే చర్చ జరుగుతుంది. లైకా ప్రొడక్షన్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మించింది