Kangana Ranaut: కోట్లిచ్చినా ఆ తప్పు చేయనంటున్న బాలీవుడ్ ఫైర్ బ్రాండ్
బాలీవుడ్ స్టార్ హీరోలు అపర కుబేరుల ఇంట్లో జరిగే ఫంక్షన్స్‌లో ఇలా డాన్స్ వేయటం, షోస్ చేసి కోట్లు వెనకేయటం కామన్. అలానే అనంత్ అంబాని పెళ్లి వేదిక మీద షారుఖ్, సల్మాన్, అమీర్ ఖాన్ డాన్స్ చేసినందుకు తల వందకోట్లు అందాయట.
Kangana Ranaut: కంగనా రనౌత్ నాటు నాటు పాటని పరమ నాటుగా విమర్శించింది. అదేం డాన్సు, అవేం పనులంటూ బాలీవుడ్ ఖాన్ త్రయాన్ని పరోక్షంగా విమర్శించింది. ముఖేశ్ అంబాని కొడుకు అనంత్ అంబాని పెళ్లి వేడుకల్లో షారుఖ్, అమీర్, సల్మాన్ ఖాన్లు నాటు నాటు సాంగ్‌కి డాన్స్ వేశారు. అందుకు వాళ్లు కోట్ల రూపాయలు చొప్పున చార్జ్ చేశారనే టాక్ ఉంది.
SAMANTHA: సడన్‌గా ఐకాన్ స్టార్‌ని ఆకాశానికెత్తిన సమంత
ఇదేం కొత్తకాదు, బాలీవుడ్ స్టార్ హీరోలు అపర కుబేరుల ఇంట్లో జరిగే ఫంక్షన్స్‌లో ఇలా డాన్స్ వేయటం, షోస్ చేసి కోట్లు వెనకేయటం కామన్. అలానే అనంత్ అంబాని పెళ్లి వేదిక మీద షారుఖ్, సల్మాన్, అమీర్ ఖాన్ డాన్స్ చేసినందుకు తల వందకోట్లు అందాయట. అంతెందుకు.. అమెరికన్ పాప్ సింగర్ రిహానా సాంగ్స్ పెర్ఫామెన్స్‌కి 70 కోట్లిచ్చాడట ముఖేష్ అంబాని. ఇవన్నీ తెలిసి బాలీవుడ్ ఐటమ్ సాంగ్ స్పెషలిస్ట్ రాఖీ సావంత్, అన్ని కోట్లు తగలేయటం కంటే తనని పిలిస్తే చీప్ అండ్ బెస్ట్ ఎంటర్‌టైన్మెంట్ దొరికేదంది. ఇక మరో బాలీవుడ్ హీరోయిన్ కంగనా అయితే ఇవేం గలీజ్ పనులంటూ మండిపడింది.
కోట్లిస్తామంటే ఇలా పెళ్లి వేడుకల్లో డాన్స్‌లు చేస్తారా అంటూ ఖాన్లనే కాదు, అలా వేడుకల్లో డాన్స్ చేసే బ్యాచ్ అందరిని విమర్శించింది. తనకి ఐదు మిలియన్లు ఇచ్చినా ఇలా పెళ్లి వేడుకల్లో చీప్‌గా డాన్స్ చేయనంది. పనిలో పనిగా తను కూడా లతా మంగేష్కర్ లానే ఇలాంటి పనులు చేయమంటూ నాటు నాటు పాటను విమర్శించింది. ఐతే ఇదే పాటకు చెర్రీ డాన్స్ చేసినా తను కేవలం సరదాగా చేశాడు కాని, డబ్బు తీసుకుని ఇలా వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో పార్టిసిపేట్ చేయలేదు.